COVID-19 Outbreak. | (Photo Credits: IANS)

New Delhi, May 19: భార‌త్‌లో గడచిన 24 గంట‌ల సమయంలో 4,529 మంది కరోనా కారణంగా మృతి చెందారు. నిన్న‌ కొత్త‌గా 2,67,334 మందికి కరోనా నిర్ధారణ (Coronavirus in India) అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,89,851 మంది కోలుకున్నారు.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,54,96,330కు (COVID-19 Cases in India) చేరింది. మృతుల సంఖ్య 2,83,248కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,19,86,363 మంది కోలుకున్నారు. 32,26,719 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 18,58,09,302 మందికి వ్యాక్సిన్లు వేశారు.

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ కు సుదీర్ఘ సమయం పడుతుందని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పేర్కొంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ రెండు, మూడు నెలల్లో పూర్తయ్యే పనికాదని స్పష్టం చేసింది. అందుకు ఎన్నో అడ్డంకులు ఉన్నాయని, వ్యాక్సినేషన్ పై అనేక అంశాలు ప్రభావం చూపుతాయని తెలిపింది.

స‌హ‌జీవ‌నం కరెక్ట్ కాదు, ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట వేసిన పిటిషన్‌పై పంజాబ్‌, హర్యానా హైకోర్టు కీల‌క‌ వ్యాఖ్యలు, యువతి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని పిటిషన్

ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ రూపొందించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను సీరమ్ భారత్ లో ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దేశ ప్రజల ప్రయోజనాలను తోసిరాజని కరోనా వ్యాక్సిన్ డోసులను విదేశాలకు ఎగుమతిచేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. జనవరి 2021 నాటికి తమ వద్ద భారీస్థాయిలో వాక్సిన్ నిల్వలు ఉన్నాయని, కానీ కోవాక్స్ కార్యాచరణలో భాగంగా కొన్ని ఒప్పందాలు ఉన్నందున వ్యాక్సిన్ ను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేశామని వివరించింది.