Coronavirus testing | File Image | (Photo Credits: PTI)

New Delhi January 08: దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య(Coronavirus in India) మ‌ళ్లీ క్ర‌మంగా పెరుగుతోంది. ఇవాళ 1,41,986 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. నిన్న‌టితో పోలిస్తే కేసుల సంఖ్య 21 శాతం అధికంగా నమోదైంది. ఇక పాజిటివిటీ రేటు (Positivity rate in India) 9.28 శాతంగా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ (Health ministry of India) వెల్ల‌డించింది.

గ‌డిచిన 24 గంట‌ల్లో కోవిడ్ వ‌ల్ల 285 మంది మృతిచెందారు. నిన్న ఒక్క రోజు సుమారు 40,895 మంది వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా యాక్టివ్ కేసుల(Active cases) సంఖ్య 4,72,169గా ఉంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,83,463గా ఉన్న‌ట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

నిన్న ఢిల్లీ(Delhi)లో ఒక్క రోజే 17 వేల కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 17.73 శాతం గా ఉంది. మ‌రోవైపు క‌రోనా వ్యాక్సినేష‌న్‌(Vaccination)లో కొత్త మైలురాయిని అందుకున్నాం. దేశ‌వ్యాప్తంగా కోవిడ్ టీకా తీసుకున్న‌వారి సంఖ్య 150 కోట్లు దాటింది. ఒక్క రోజే దేశ‌వ్యాప్తంగా 3,071 ఒమిక్రాన్ కేసులు(Omicron cases) న‌మోదు అయ్యాయి. ఒమిక్రాన్ నుంచి రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య 1203గా ఉంది. మ‌హారాష్ట్ర‌ (Maharashtra)లో అత్య‌ధికంగా 876 మందికి ఒమ్రికాన్ వేరియంట్ సోకింది.

Coronavirus in Delhi: ఢిల్లీలో పెరుగుతున్న డైలీ కరోనా కేసులు, ఇవాళ 20వేల కేసులు దాటే అవకాశం, కట్టుదిట్టంగా కొనసాగుతున్న వీకెండ్ లాక్‌డౌన్‌