Medical workers (Photo Credits: IANS)

New Delhi January 09: దేశంలో కరోనా కేసులు(Corona Cases) రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌(Omicron) విజృంభణతో కరోనా బారినపడుతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తాజాగా రోజువారీ కేసులు(Daily corona cases) లక్షన్నర దాటాయి. కేసులతోపాటు పాజిటివిటీ రేటు, యాక్టివ్‌ కేసులు(Active cases) కూడా అధికమవుతుండటంతో సవ్రత్ర ఆందోళన వ్యక్తవమవుతున్నది. దీంతో రాష్ట్రాలు క్రమంగా కరోనా ఆంక్షలను రెట్టింపు చేస్తున్నాయి.

దేశవ్యాప్తంగా కొత్తగా 1,59,632 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,55,28,004కు చేరాయి. ఇందులో 3,44,53,603 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకోగా(recovery in India), 5,90,611 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,83,790 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 40,863 మంది కోలుకోగా, 327 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ (Health Ministry Of India) వెల్లడించింది. యాక్టివ్‌ కేసులు 1,18,442 పెరిగాయని తెలిపింది.  భారీగా కరోనా కేసులు నమోదవుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 10.21కి చేరిందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 151.58 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

Covid Cases in World: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి వైరస్, వారం రోజులుగా డైలీ సగటున 20 లక్షల కేసులు, అమెరికా, కెనడాల్లోనే అధికంగా కేసులు

ఇక కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (Omicron In India) దేశంలో విజృంభిస్తున్నది. ఒమిక్రాన్‌ కేసులు 3623కు పెరిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో 1409 మంది కోలుకున్నారని తెలిపింది. మొత్తం 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్త వేరియంట్‌ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 1009 కేసులు ఉండగా, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441, రాజస్థాన్‌ 373, కేరళ 204, తమిళనాడు 185, హర్యానా, తెలంగాణలో 123 చొప్పున ఉన్నాయి.