Coronavirus in India: 209 రోజుల తర్వాత అత్యంత తక్కువగా కేసులు, దేశంలో తాజాగా 18,346 మందికి కరోనా, ఆందోళన కలిగిస్తున్న మరణాలు
Coronavirus outbreak | (Photo Credits: IANS)

New Delhi, Oct 5: దేశంలో 209 రోజుల తర్వాత అత్యంత తక్కువగా కరోనా కేసులు (Coronavirus in India) నమోదు కావడం ఊరటనిస్తోంది. గత కొద్ది రోజులుగా 20వేలపైనే కొనసాగుతున్న కొత్త కేసులు.. తాజాగా ఆ మార్క్‌ దిగువకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11.41లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,346 మందికి ( India reports 18,346 new cases) పాజిటివ్‌గా తేలింది. కొత్త కేసులు ఇంత తక్కువగా నమోదవడం 209 రోజుల్లో ఇదే తొలిసారి.

అయితే ఇదే సమయంలో మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతక్రితం రోజున మరణాల సంఖ్య 200 దిగువకు పడిపోగా.. తాజాగా నిన్న 263 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇందులో సగానికి పైగా మరణాలు ఒక్క కేరళలోనే నమోదవడం గమనార్హం. ఆ రాష్ట్రంలో నిన్న 8,850 కొత్త కేసులు వెలుగుచూడగా.. 149 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు 4,49,260 మందిని కొవిడ్‌ బలితీసుకుంది. అయితే కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం కాస్త సానుకూలాంశం. నిన్న మరో 29,639 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 3.31కోట్ల మంది కరోనాను జయించారు. రికవరీ రేటు 97.93శాతానికి పెరిగింది.

యూపీ ఆందోళనలో రైతన్నలపై దూసుకెళ్లిన కారు, నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మృతి, నిరసన తెలిపేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీ అరెస్ట్, కేంద్ర మంత్రి కుమారుడిపై మ‌ర్డ‌ర్ కేసు నమోదు

ఇక కొత్త కేసులు తగ్గుతుండటంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 200 రోజుల కనిష్ఠానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,52,902 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 0.75శాతంగా ఉంది. ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దూసుకెళ్తోంది. నిన్న మరో 72.51లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 91.54కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి.