
New Delhi, December 27: ఓ వైపు కొత్త కరోనావైరస్ భయం ఇండియాను (New Covid Starain) వెంటాడుతోంది. మరోవైపు పాత కరోనా వైరస్ ప్రభావం (India Coronavirus) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 18,732 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,87,850కు చేరింది.
279 మంది మృత్యువాత పడడంతో మొత్తం మరణాల సంఖ్య 1,47,622కు చేరింది. ఇవాళ కరోనా నుంచి కొత్తగా 21,430 కోలుకోగా.. మొత్తం 97,61,538 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 2,78,690 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో కరోనా రికవరీ రేటు 95.77 శాతంగా ఉంది.
మహారాష్ట్రలో కొత్తగా 2,854 కరోనా పాజిటివ్ కేసులు (Maharashtra Coronavirus) నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. శనివారం 1,526 మంది డిశ్చార్జ్ అయ్యారని, మరో 60 మంది చనిపోయారని వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19,16,236కు చేరింది. ఇప్పటి వరకు 18,07,824 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58,091 యాక్టివ్ కేసులున్నాయి.
కరోనా మహమ్మారే మానవాళి ఎదుర్కొనే చివరి సంక్షోభం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. పర్యావరణ మార్పులను నివారించని పక్షంలో ప్రజారోగ్యం మెరుగు పరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఆధోగతి తప్పదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథానమ్ వ్యాఖ్యానించారు. సంక్షోభ సమయాల్లో డబ్బులు వెదజల్లుతూ తాత్కాలిక పరిష్కారాల కోసం ప్రయత్నించే ప్రభుత్వాల వైఖరిపై కూడా ఆయన మండిపడ్డారు. ఈ దూరదృష్టి లేమీ ప్రమాదకరమని, అప్పటికప్పుడూ పరిష్కాల కోసం వెతుకులాడకుండా దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయాలని కోరారు. కరోనా సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.