Coronavirus | Representational Image (Photo Credits: ANI)

New Delhi, March 24: భారత్‌ లో కరోనా తీవ్రత భారీగా తగ్గింది. యాక్టీవ్ కేసుల సంఖ్య దాదాపు 20వేలకు చేరింది. ఇక రోజువారీ కరోనా కేసులు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో1,938 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. బుధవారం నాడు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 67 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,16,672 కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 2,531 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,24,75,588గా ఉంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య (Corona Active cases) కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22,427 యాక్టీవ్ కేసులున్నాయి. యాక్టీవ్ కేసులశాతం 0.05 శాతంగా ఉంది. అటు రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు (Daily positivity rate) భారీగా తగ్గింది. ప్రస్తుతం 0.29% శాతంగా ఉంది.

12-14 ఏళ్లవారికి వ్యాక్సినేషన్ (Vaccination) వేగంగా సాగుతోంది. ఇటీవల మొదలుపెట్టిన వ్యాక్సినేషన్ శరవేగంగా జరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా ఫస్ట్ డోసులు ఇచ్చినట్లు తెలిపింది. అటు ప్రికాషన్ డోసుల పంపిణీ కూడా వేగవంతం చేశారు. దేశవ్యాప్తంగా 180 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

Karnataka High Court: భార్యపై లైంగిక దాడి నేరమే, పెళ్లి చేసుకున్నంత మాత్రాన భార్యపై అత్యాచారం సరికాదని సంచలన వ్యాఖ్యలు చేసిన క‌ర్ణాట‌క హైకోర్టు

కరోనా తీవ్రత తగ్గడంతో ఈ నెల 31 నుంచి కరోనా నిబంధనలు ఎత్తివేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. కానీ మాస్క్, భౌతికదూరం వంటి నిబంధనలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. విపత్తు నిర్వహణ చట్టం కింద జారీ చేసిన నిబంధనలను మాత్రమే వెనక్కు తీసుకోనుంది కేంద్రం.