Coronavirus Outbreak (Photo Credits: IANS)

New Delhi, April 26:  శనివారం సాయంత్రం నుంచి  ఆదివారం సాయంత్రం వరకు గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 1,975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో COVID-19 బాధితుల సంఖ్య ఆదివారం నాటికి 26,917 కు చేరుకున్నాయి. అదే సమయంలో కరోనావైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 826కి పెరిగింది. కాగా, ఈరోజు 111 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,914 కరోనావైరస్ బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20,177 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.

ఇక కరోనా తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో కోవిడ్-19 కేసుల సంఖ్య 7,628 దాటింది. అలాగే రాష్ట్రం నుంచి కరోనా మరణాల సంఖ్య 323గా ఉంది. మహారాష్ట్రలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో ఎక్కువ శాతం ముంబై, పుణె మరియు థానే నగరాల నుంచే ఉన్నాయి. ఒక్క ముంబై నగరం నుంచే 4,500 పైగా పాజిటివ్ కేసులు 200కు పైగా మరణాలు నమోదయ్యాయి.

రాష్ట్రాల వారీగా నమోదైన కోవిడ్-19 కేసుల వివరాలు ఇలా ఉన్నాయి

S. No. Name of State / UT Total Confirmed cases (Including 111 foreign Nationals) Cured/Discharged/Migrated Death
1 Andaman and Nicobar Islands 33 11 0
2 Andhra Pradesh 1097 231 31
3 Arunachal Pradesh 1 1 0
4 Assam 36 19 1
5 Bihar 251 46 2
6 Chandigarh 30 17 0
7 Chhattisgarh 37 32 0
8 Delhi 2625 869 54
9 Goa 7 7 0
10 Gujarat 3071 282 133
11 Haryana 289 176 3
12 Himachal Pradesh 40 22 1
13 Jammu and Kashmir 494 112 6
14 Jharkhand 67 13 3
15 Karnataka 501 177 18
16 Kerala 458 338 4
17 Ladakh 20 14 0
18 Madhya Pradesh 2096 210 99
19 Maharashtra 7628 1076 323
20 Manipur 2 2 0
21 Meghalaya 12 0 1
22 Mizoram 1 0 0
23 Odisha 103 34 1
24 Puducherry 7 3 0
25 Punjab 298 67 17
26 Rajasthan 2083 493 33
27 Tamil Nadu 1821 960 23
28 Telengana 991 280 26
29 Tripura 2 2 0
30 Uttarakhand 50 26 0
31 Uttar Pradesh 1843 289 29
32 West Bengal 611 105 18
Total number of confirmed cases in India 26917 5914 826

నివేదికల ప్రకారం, భారతదేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో సుమారు 68 శాతం కేసులు కేవలం 27 జిల్లాల నుండే నమోదయ్యాయని తెలిసింది. కాగా, COVID-19 రోగుల అత్యధిక రికవరీ రేటు కేరళలో ఉంది, ఈ రాష్ట్రంలో రికవరీ రేటు దేశంలోనే అత్యధికంగా 74% గా నమోదైంది.

వైరస్ వ్యాప్తి కట్టడి కోసం భారతదేశంలో మే 3 వరకు లాక్డౌన్ అమలులో ఉంది. రాష్ట్రాల్లో లాక్డౌన్ పరిస్థితులు, వైరస్ నివారణ చర్యలే ప్రధానాంశంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం (ఏప్రిల్ 27) ముఖ్యమంత్రులతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.