COVID19 in India: కేరళ రాష్ట్రంలో మళ్లీ 21 వేలు దాటిన రోజూవారీ కోవిడ్ కేసులు; భారత్‌లో కొత్తగా 35,178 కోవిడ్ కేసులు, 530 మరణాలు నమోదు మరియు 37,169 మంది రికవరీ
దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు 50 కోట్లు దాటినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. ఇప్పటివరకు 50,03,00,840 టెస్టులు చేయగా, నిన్న ఒక్కరోజే 18,73,757 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది...
New Delhi, August 19: భారత్‌లో సెకండ్ వేవ్ కరోనా తగ్గుముఖం పడుతోంది, రోజూవారీ కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఇండిపెండెన్స్ డే నుంచి వైరస్ నిర్ధారణ పరీక్షలు తగ్గడంతో నిన్న 25 వేలకు చేరిన రోజూవారీ కోవిడ్ కేసులు, మళ్లీ ఇప్పుడు 35 వేలకు పెరిగాయి. ఏదైమైనా గడిచిన వారం నుంచి రోజూవారీ కోవిడ్ కేసులు 40 వేలకు తక్కువగానే నమోదవుతున్నాయి. మరోవైపు కేరళ రాష్ట్రంలో వరుసగా మూడు రోజుల పాటు 20 వేల కంటే తక్కువగా నమోదైన రోజూవారీ కోవిడ్ కేసులు మళ్లీ 20 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో 21,427 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో గరిష్ఠ పాజిటివిటీ రేటు 15.5% గా ఉంది.
ఇక, గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 35,178 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,85,857 కు చేరింది. నిన్న ఒక్కరోజే 530 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,33,049 కు పెరిగింది.
అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,169 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,14,85,923 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,67,415 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.53% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.13 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.34% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
India's COVID Status Update:
India reports 35,178 new #COVID19 cases, 37,169 recoveries and 440 deaths in the last 24 hrs, as per Health Ministry.
Total cases: 3,22,85,857
Total recoveries: 3,14,85,923
Active cases: 3,67,415
Death toll: 4,32,519
Total vaccinated: 56,06,52,030 (55,05,075 in last 24 hrs) pic.twitter.com/NttrUIFE74
— ANI (@ANI) August 18, 2021
ఆగష్టు 18 నాటికి దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు 50 కోట్లు దాటినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. ఇప్పటివరకు 50,03,00,840 టెస్టులు చేయగా, నిన్న ఒక్కరోజే 18,73,757 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 55,05,075 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 56.06 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 56,06,52,030 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 44.01 కోట్లు ఉండగా, 12.63 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.
(The above story first appeared on LatestLY on Aug 19, 2021 10:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

