Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, july 5: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 39,796 కరోనా కేసులు (:Coronavirus Cases in India) నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజు 723 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.05 కోట్లకు (Coronavirus in India) చేరుకుంది. 4,02,728 మంది ఇప్పటి వరకూ కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 42,352 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 4.82 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో 97 శాతానికి కరోనా రికవరీ రేటు పెరిగింది. కాగా.. ఇప్పటి వరకూ దేశంలో 35.12 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.

కరోనా సెకెండ్ వేవ్ దేశంలో కల్లోలాన్ని సృష్టించింది. అయితే తాజాగా అందిన ఒక రిపోర్టులో ఉన్న వివరాల ప్రకారం కరోనా మొదటి వేవ్‌తో పోల్చిచూస్తే, సెకెండ్ వేవ్‌లో కరోనాతో బాధపడుతూ ఆసుపత్రులలో చేరిన పురుషుల సంఖ్య తక్కువగా ఉంది. అయితే మృతుల సంఖ్య మూడింతలు పెరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు చెందిన శాస్త్రవేత్తలు కరోనా రెండు వేవ్‌ల క్లినికల్ ప్రొఫైల్స్ అధ్యయనం చేసి, పలు వివరాలను వెల్లడించారు.

ధర్డ్ వేవ్ భయం..కరోనా సోకిన పిల్లల్లో కొత్తగా MIS-C వ్యాధి, దావణగెరెలో మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్‌తో 5 ఏళ్ల బాలిక మృతి, కర్ణాటక రాష్ట్రంలో తొలి మరణం కేసు నమోదు

ఈ అధ్యయనం ప్రకారం మొదటి వేవ్‌తో పోల్చి చూస్తే రెండవ వేవ్‌లో అధిక సంఖ్యలో యువత కరోనా బారిన పడ్డారు. అలాగే రెండు వేవ్‌లలోనూ ఆసుపత్రులో చేరిన వారిలో 70 శాతంమంది 40 ఏళ్లు పైబడినవారే ఉన్నారు. రెండు వేవ్‌ల మధ్య తేడా తెలుసుకునేందుకే ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ఇందుకు అవసరమైన డేటాను నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీ నుంచి స్వీకరించారు. ఈ డేటాను దేశంలోని 41 ఆసుపత్రుల నుంచి సేకరించారు.

ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం 20 ఏళ్ల వయసు లోపు గలవారు మినహా, మిగిలిన వయసుల వారంతా అత్యధిక సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. 20 నుంచి 39 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారిలో అత్యధికులు ఆసుపత్రులలో చేరారు. ఈ అధ్యయానికి సంబంధించిన నివేదికను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురించారు.