New Delhi, October 22: భారతదేశంలో కొవిడ్ తీవ్రత గతంలో కంటే కాస్త తగ్గుముఖం పట్టింది, ఇలాంటి పరిస్థితుల్లో మరింత నియంత్రణ పాటిస్తేనే, వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. లాక్డౌన్ నుంచి అనేక సడలింపులు అందుకుంటున్న నేపథ్యంలో ప్రజలు తమకు తాముగా రక్షణ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 55,838 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం ఉదయం నాటికి 77,06,946కు చేరింది. నిన్న ఒక్కరోజే 702 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,16,616కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 79,415 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 68,74,518 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 7,15,812 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్నటి నుంచి ఈరోజు వరకు ఒక్కరోజులోనే ఆక్టివ్ కేసుల సంఖ్య 24,278 తగ్గడం ఊరటనిచ్చే విషయం. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India's COVID19 Update:
📍#COVID19 India Tracker
(As on 22 October, 2020, 08:00 AM)
➡️Confirmed cases: 77,06,946
➡️Recovered: 68,74,518 (89.20%)👍
➡️Active cases: 7,15,812 (9.29%)
➡️Deaths: 1,16,616 (1.51%)#IndiaFightsCorona#Unite2FightCorona#StaySafe
Via @MoHFW_INDIA pic.twitter.com/Z0TRozX5AZ
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) October 22, 2020
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 89.20% ఉండగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 9.29% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.51% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇక అక్టోబర్ 20 వరకు దేశవ్యాప్తంగా 9,86,70,363 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 14,69,984 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
ఇక కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో దేశంలోనే మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతుంంది. ఈ రాష్ట్రంలో కేసులు 16,17,658కు చేరగా, కొవిడ్ మరణాలు 42,633కు పెరిగాయి. గణాంకాల ప్రకారం మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మరియు కేరళ రాష్ట్రాలు కొనసాగుతున్నాయి.