Coronavirus | Representational Image (Photo Credits: ANI)

New Delhi, June 20: భారత్‌లో 81 రోజుల తర్వాత కనిష్ట స్థాయిలో కరోనా కేసులు నయోదయ్యాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,419 కరోనా పాజిటివ్‌ కేసులు (Coronavirus in India) నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,576 మంది కోవిడ్‌ బాధితులు మృతి (Covid Deaths) చెందారు. దీంతో కరోనా వైరస్‌ బారినపడి మొత్తం 3,86,713 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గత 24 గంటల్లో 87,619 మంది కోవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,87,66,009 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 7,29,243 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 2,98,81,965 మంది కరోనా బారిన పడ్డారు. దేశంలో ఇప్పటివరకు 27.66 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్రభావం చాలావ‌ర‌కు త‌గ్గింది. అయినా రోజువారీ క‌రోనా ప‌రీక్ష‌ల ప్ర‌క్రియ నిరంత‌రాయంగా కొన‌సాగుతున్న‌ది. ప్ర‌తిరోజూ 20 ల‌క్ష‌ల‌కు అటుఇటుగా క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి.

రేపటి నుంచి మరిన్ని ట్రైన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపిన రైల్వేశాఖ, విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక రైళ్లు మరికొంత కాలం పొడిగింపు, పూర్తి సమాచారం ఇదే..

శ‌నివారం కూడా 18,11,446 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దాంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన మొత్తం క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య 39,10,19,083కు చేరింది. ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్‌) ఆదివారం మీడియాకు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.