New Delhi, September 23: దేశంలో గత 24 గంటల్లో 83,347 పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 56,46,011కు చేరింది. ఇందులో 45,87,614 మంది బాధితులు కోలుకోగా, 9,68,377 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 1085 మంది బాధితులు కరోనాతో మరణించడంతో మొత్తం మృతులు 90,020కి (COVID-19 Deaths) చేరారు. దేశంలో నిన్న 9,53,683 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి ప్రకటించింది. దీంతో సెప్టెంబర్ 22 వరకు మొత్తం 6,62,79,462 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.
ఇదిలా ఉంటే దేశంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో లక్ష మందికి పైగా రోగులు కరోనా (Coronavirus Pandemic) నుంచి రికవరీ అయ్యారు. సోమవారం ఏకంగా 1,01,468 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 45,87,614కు చేరుకుంది. మరోవైపు కొత్త కేసుల సంఖ్య కూడా ఇటీవల వస్తున్న రోజూవారీ కేసులతో పోలిస్తే తగ్గాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 80.86 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.60 శాతానికి పడిపోయిందని తెలిపింది. సెప్టెంబర్ 21 వరకు 6,53,25,779 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
గుడ్ న్యూస్, 16 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు, రాజ్యసభలో వెల్లడించిన విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్
గత 24 గంటల్లో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 344 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. నాలుగు రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటున్నాయని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్న మొత్తం కేసుల్లో భారత్ నుంచి 17.7 శాతం కేసులు ఉన్నాయని చెప్పారు. అయితే కోలుకున్న వారిలో 19.5 శాతం ఉన్నారని చెప్పారు.
అమెరికా నుంచి 22.4 శాతం కేసులు ఉండగా, అక్కడ కోలుకున్న వారి శాతం 18.6గా ఉందని చెప్పారు. బ్రెజిల్‌తో పోల్చినప్పటికీ, భారత్ నుంచే రికవరీలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కోవిడ్–19 టాస్క్‌ఫోర్స్ సభ్యుడు వీకీ పాల్ మాట్లాడుతూ.. రానున్న పండుగ సీజన్లో ప్రజలంతా భౌతిక దూరం పాటించడం వంటివి మరచిపోరాదని చెప్పారు.