COVID19 in India: భారత్‌లో 8 లక్షలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో అత్యధికంగా 27,114 కేసులు నమోదు, 22 వేలు దాటిన కరోనా మరణాలు
COVID-19 Outbreak in India. | PTI Photo

New Delhi, July 11:  భారతదేశంలో ఒకరోజును మించి మరొకరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 27,114  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.  దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 820,916 కు చేరింది. నిన్న ఒక్కరోజే 519 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 22,123 కు పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో అత్యధికంగా దేశవ్యాప్తంగా 19,872 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 515,385 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 283,407 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update: 

ప్రపంచవ్యాప్తంగా COVID-19 కేసుల సంఖ్య 12.4 మిలియన్లు దాటింది, అలాగే కొవిడ్ కారణంగా సంభవించిన ప్రాణనష్టం సంఖ్య 559,000 పైగా ఉందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.

శనివారం ఉదయం నాటికి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం COVID-19 కేసుల సంఖ్య 12,461,962 ఉండగా, మరణాల సంఖ్య 559,481 గా ఉన్నట్లు పెరిగాయని యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్‌ఎస్‌ఇ) తన తాజా నవీకరణలో వెల్లడించింది.

3,182,385 కొవిడ్ కేసులు మరియు 1,34,073 మరణాలతో యునైటైడ్ స్టేట్స్ అత్యధికంగా నష్టపోయిన దేశంగా అగ్రస్థానంలో ఉండగా,

1,800,827 పాజిటివ్ కేసులు మరియు 70,398 మరణాలతో బ్రెజిల్ రెండవ స్థానంలో నిలిచింది.

ఇక పైన చెప్పబడిన తాజా కేసులతో ఇండియా మూడవ స్థానంలో ఉంది, ఆ తరువాత రష్యా (712,863), పెరూ (319,646), చిలీ (309,274), యుకె (289,678), మెక్సికో (289,174), స్పెయిన్ (253,908), ఇరాన్ (252,720) ), దక్షిణాఫ్రికా (250,687), పాకిస్తాన్ (243,599), ఇటలీ (242,639), సౌదీ అరేబియా (226,486), టర్కీ (210,965), ఫ్రాన్స్ (208,015), జర్మనీ (199,332), బంగ్లాదేశ్ (178,443), కొలంబియా (133,973), కెనడా (108,959), ఖతార్ (102,630) దేశాలు ఉన్నట్లు సిఎస్‌ఎస్‌ఇ గణాంకాలను విడుదల చేసింది.