Coronavirus Cases in India (Photo Credits: PTI)

New Delhi, August 1:  భారతదేశంలో ప్రతిరోజు రికార్డు స్థాయిలో కొవిడ్19 కేసులు నమోదవుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 57,117 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో  మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 16,95,988 కు చేరింది. నిన్న ఒక్కరోజే 764 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 36,511 కు పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో  దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 36,568  కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,094,374 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 565,101 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update:

రాష్ట్రాల వారీగా  యాక్టివ్ కరోనా  కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:

S. No. Name of State / UT Active Cases* Cured/Discharged/Migrated* Deaths**
Total Change since yesterday Cumulative Change since yesterday Cumulative Change since yesterday
1 Andaman and Nicobar Islands 329 63  214 13  5
2 Andhra Pradesh 75720 6468  63864 3840  1349 68 
3 Arunachal Pradesh 670 16  918 91  3
4 Assam 9814 581  30357 1277  98
5 Bihar 17579 734  33358 2008  296 14 
6 Chandigarh 369 14  667 20  15
7 Chhattisgarh 2803 14  6230 309  53
8 Dadra and Nagar Haveli and Daman and Diu 412 18  686 18  2
9 Delhi 10705 38  120930 1206  3963 27 
10 Goa 1657 4211 206  45
11 Gujarat 14090 297  44907 833  2441 23 
12 Haryana 6317 180  28227 887  421
13 Himachal Pradesh 1091 14  1459 72  14
14 Jammu and Kashmir 7765 103  12217 375  377 12 
15 Jharkhand 6538 650  4314 138  106
16 Karnataka 72013 2305  49788 3094  2314 84 
17 Kerala 10517 443  13023 864  73
18 Ladakh 302 25  1095 7
19 Madhya Pradesh 8668 214  22271 614  867 10 
20 Maharashtra 150966 2512  256158 7543  14994 265 
21 Manipur 927 98  1689 17  5
22 Meghalaya 603 15  215 5
23 Mizoram 165 247 13  0
24 Nagaland 1053 117  635 10  5
25 Odisha 11182 719  20518 772  177
26 Puducherry 1323 31  2100 142  49
27 Punjab 4999 422  10734 225  386 16 
28 Rajasthan 11589 492  29035 650  674 11 
29 Sikkim 407 12  231 17  1
30 Tamil Nadu 57968 183956 5778  3935 97 
31 Telengana 16796 1156  45388 816  519 14 
32 Tripura 1630 93  3327 365  21
33 Uttarakhand 2935 58  4168 172  80
34 Uttar Pradesh 34968 2319  48863 2060  1630 43 
35 West Bengal 20233 333  48374 2118  1581 45 
Total# 565103 19785  1094374 36569  36511 764 
*(Including foreign Nationals)
**( more than 70% cases due to comorbidities )

 

మహారాష్ట్రలో ఒకరోజులో వచ్చే పాజిటివ్ కేసుల సంఖ్య ఇటీవల కాలంగా మిగతా కొన్ని రాష్ట్రాల కంటే తక్కువగానే నమోదవుతున్నప్పటికీ, కొవిడ్ తీవ్రత మాత్రం ఇప్పటికీ ఎక్కువగానే కనిపిస్తోంది. నిన్న కొత్తగా మరో 7543 పాజిటివ్ కేసులు, 263 కరోనా మరణాలు నమోదయ్యాయి.

దీంతో ఈ రాష్ట్రంలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 4,22,118 కు చేరింది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు అత్యధికంగా 2,45,859 పాజిటివ్ కేసులు 3,935 మరణాలతో రెండో స్థానంలోనూ, 1,40,933 పాజిటివ్ కేసులతో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో కొనసాగుతున్నాయి.

కరోనావైరస్ టెస్టుల విషయానికి వస్తే,  గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా  రికార్డ్ స్థాయిలో 5,25,689  శాంపుల్స్ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.  జూలై 31 వరకు మొత్తంగా 1,93,58,659  టెస్టులు నిర్వహించినట్లు వెల్లడించింది.