![](https://test1.latestly.com/wp-content/uploads/2022/06/Deepak-Chahar-Wedding-Pics-380x214.jpg)
Agra, FEB 03: ప్రముఖ క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయ భరద్వాజ్ (Deepak Chahal's wife) ను రూ. 10 లక్షల మేర మోసపోయింది (Chahar's wife duped ). బిజినెస్ వెంచర్ పేరుతో ఆమెను కొందరు మోసం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దీపక్ చాహర్ తండ్రి లోకేంద్ర చాహర్ ఆగ్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కు చెందిన ధృవ్, కమలేష్ (Kamlesh Pareek) ప్రతీక్ లు ఈ కేసులో నిందితులుగా భావిస్తున్నారు. వారిలో ఒకరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు చెందిన అధికారి అని తెలుస్తోంది. గతేడాది అక్టోబర్ 7న ఇద్దరు నిందితులు దీపక్ చాహర్ భార్య జయ భరద్వాజ్ దగ్గర పది లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అప్పటి నుంచి డబ్బులను ఇచ్చేందుకు ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులో తెలిపారు. అంతేకాదు డబ్బులు అడిగితే తమను తిడుతున్నారని కూడా చాహర్ ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నారు. దీంతో వారిపై చర్య తీసుకోవాలని చాహర్ భార్య, ఆయన తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీపక్ చాహర్ కు గతేడాది జూన్ 2న జయ భరద్వాజ్ తో మ్యారేజ్ అయింది.