Indian Railways To Hike Prices Of Tea And Meals Served On Trains(Photo-ANI)

Mumbai, November 15: రైల్వే ప్రయాణికులు ఇండియన్ రైల్వే (Indian Railways)బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులు ఇంటి నుంచి సొంత పుడ్ తీసుకువెళ్లడం మంచిది. ఎందుకంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ ధరలను‘(IRCTC Meals Price Hike) పెంచింది. పర్యాటక, క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టర్ గురువారం విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం, రాజధాని, శాతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్‌Rajdhani, Duronto and Shatabdi express)లలో టీ, టిఫిన్‌, భోజనం రేట్లను పెంచింది.

నవంబర్ 14 నుంచి రాజధాని / శతాబ్ది /దురంతో రైళ్లలో ప్రామాణిక భోజనంపై క్యాటరింగ్ సేవల రేట్లను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) విడుదల చేసిన ఒక సర్క్యులర్‌లో తెలిపింది. కొత్త మెనూ, రేట్లు టికెటింగ్ విధానంలో 15 రోజుల తరువాత అందిస్తామని, పెంచిన రేట్లు సర్క్యులర్ జారీ చేసిన తేదీ నుండి 120 రోజుల తరువాత వర్తిస్తాయని తెలిపింది.

రేట్ల సవరణ తరువాత రాజధాని, దురంతో, శాతాబ్డి ఎక్స్‌ప్రెస్‌లలో ఒక కప్పు టీ ధర రూ .10 నుండి రూ .15 కు పెంచారు. అదే స్లీపర్ క్లాస్‌, సెకండ్ క్లాస్ ఏసీ బోగీల్లో అయితే టీ ధర రూ .20. ఇక భోజనం విషయానికొస్తే, దురంతో ఎక్స్‌ప్రెస్ స్లీపర్ క్లాస్‌లో లంచ్‌/ డిన్నర్‌కు రూ. 120 రూపాయిలు చెల్లించాల్సిందే. మునుపటి ధర. రూ.80. ఈ రైళ్లలో సాయంత్రం వేళలో ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో టీ ధర రూ.35 (రూ .6 పెంపు) అల్పాహారం రూ. 140, (రూ .7 పెంపు) లంచ్‌ డిన్నర్ రూ .245గా ఉంది. ఇది దాదాపు రూ .15 పెరిగింది