Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, May 2:  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 2,293 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో భారతదేశంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 37,336 దాటింది. నిన్న ఒక్కరోజే 71 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1218 పెరిగిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. ఇక ఇప్పటివరకు 9950 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 26,167 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.

మహారాష్ట్ర రాష్ట్రం కరోనా మహమ్మారి ధాటికి విలవిలలాడుతోంది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఈ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈరోజు ఉదయం నాటికి మహారాష్ట్రలో కోవిడ్-19 కేసుల సంఖ్య 11,500 దాటాయి. అలాగే మరణాల సంఖ్య 485కు పెరిగింది. మహారాష్ట్రలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో సుమారు 7,800 పైగా కేసులు, 295 మరణాలు ఒక్క ముంబై నగరంలోనే నమోదయ్యాయి.  ఏపీలో కొత్తగా 60 కేసులు, తెలంగాణలో 6 కేసులు నమోదు, లాక్‌డౌన్ లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించిన కేంద్రం

దేశంలో కరోనావైరస్ తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ను మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మే 4వ తేదీ నుంచి మే 17 వరకు రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది. రెండో దఫా లాక్‌డౌన్‌ గడువు మే 3తో ముగియనుండటంతో కేంద్ర హోంశాఖ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది, అయితే వైరస్ వ్యాప్తి తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్ మరియు గ్రీన్ జోన్లుగా విభజించి మరికొన్ని సడలింపులను ప్రకటించారు.