Coronavirus Outbreak | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, August 7: ‌దేశంలో గ‌త‌ తొమ్మిదోరోజులుగా 52 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు (Coronavirus Cases) న‌మోద‌య్యాయి. తాజాగా గత 24 గంటల్లో అత్య‌ధికంగా 62 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఒకేరోజులో ఇంత భారీ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,27,075కు (COVID-19 tally) చేరాయి. ఇందులో 6,07,384 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 13,78,106 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న ఉద‌యం నుంచి ఈరోజు ఉద‌యం వ‌ర‌కు 886 మంది (COVID-19 Deaths) మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మృతుల సంఖ్య 41,585కు పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.

తాజాగా న‌మోద‌వుతున్న పాజ‌టివ్ కేసుల్లో దాదాపు 38 శాతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, బీహార్ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. జూలై నెల‌లో దేశ‌వ్యాప్తంగా న‌మోదైన కేసుల్లో ఈ రాష్ట్రాల వాటా 19 శాతంగానే ఉన్న‌ది. దేశంలో ఆగ‌స్టు 6 వ‌ర‌కు 2,27,24,134 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని, నిన్న ఒకేరోజు 5,74,783 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది.ప్రస్తుతం కరోనా దేశంలో మరణాల రేటు 2. 07గా ఉంది. భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. వైరస్‌ కోరల్లోంచి బయటపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 68 శాతానికి పెరిగింది. చైనాలో మరో ప్రమాదకర వైరస్, ఎస్ఎఫ్‌టీఎస్ దెబ్బకు ఏడు మంది మృతి, 60 మంది ఆస్పత్రిలో చేరిక, మ‌నుషుల ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ

హిమాచల్ ప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి సుఖ్‌రామ్‌ చౌదరి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ధ్రువీకరించారు. ఇటీవల తనను కలిసిన వారంతా హోం ఐసోలేషన్‌లో ఉండాలని, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, సుఖ్‌రామ్‌ జూలై చివరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అదే రోజు కేబినెట్‌ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో సీఎం జైరామ్‌ ఠాకూర్‌తో పాటు మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు పాల్గొన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా షిమ్లాకు పెద్ద సంఖ్యలో మద్దతుదారులు వచ్చారు. అలాగే సొంత జిల్లా సిర్మౌర్‌, పాంటా సాహిబ్‌ నియోజకవర్గంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఇప్పుడు మంత్రికి కరోనా పాజిటివ్‌ రావడంతో హిమాచల్‌ ప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తున్నది. అమెరికాను వణికిస్తున్న ఎర్ర ఉల్లిపాయ, యుఎస్, కెనడాలో పెరుగుతున్న సాల్మొనెల్లా కేసులు, ఎరుపు రంగు ఆనియన్స్ ద్వారా వ్యాధి వస్తుందని తెలిపిన సీడీసీ

కరోనా కాటుకు మొట్టమొదటిసారి ఓ జడ్జి బలయ్యారు. పాట్నా నగరానికి చెందిన హరిశ్చంద్ర శ్రీవాస్తవ ఫ్యామిలీ కోర్టు జడ్జి శ్రీవాస్తవకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో అతన్ని పాట్నాలోని ఎయిమ్స్ కు తరలించారు. శ్రీవాస్తవ చికిత్స పొందుతూ మరణించారని బీహార్ జుడీషియల్ సర్వీసెస్ అసోసియేషన్ కార్యదర్శి అజిత్ కుమార్ సింగ్ చెప్పారు. కరోనాతో జడ్జి శ్రీవాస్తవ మరణించడం బాధాకరమని అజిత్ కుమార్ చెప్పారు.

అమెరికాలో కరోనా వైరస్‌ అంతకంతకూ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో 58 వేల కొత్త కేసులు నమోదవ్వగా 2,060 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. గత మూడు నెలల్లో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇదే అత్యధికమని జాన్స్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం గురువారం తెలిపింది. అంతకుముందు మే 7న అమెరికాలో ఒకే రోజు 2 వేలకు పైగా మరణాలు సంభవించాయని వెల్లడించింది. అమెరికాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 5 మిలియన్లు దాటింది. గురువారం నాటికి 5,032,179 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా మృతుల సంఖ్య 1,62,804కు చేరింది. 2,576,668 మంది కోలుకున్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 19 మిలియన్ల జనాభా కరోనా బారిన పడ్డారు. మొత్తం 19,254,157 మందికి కరోనా సోకగా.. 7,17,655 మందికి పైగా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 12,355,351 కోలుకొని డిశ్చార్జి అయ్యారు