Medical workers (Photo Credits: IANS)

New Delhi, Sep 22: దేశంలో గడచిన 24 గంటలలో 75,083 పాజిటివ్ కేసులు (Coronavirus) నమోదవ్వగా.. 1,053 మంది మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు మంగళవారం హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య (India's COVID-19) 55,62,664గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 9,75,861గా ఉండగా.. కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 44,97,868కి చేరింది. కోవిడ్‌ వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 88,935కు చేరింది.

గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,01,468 మంది కరోనా నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 80.12 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 18.28 శాతంగా ఉన్నాయి. దేశంలో మొత్తం నమోదయిన కేసుల్లో మరణాల రేటు 1.60 శాతానికి తగ్గింది. గడచిన 24 గంటలలో 9,33,185 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. దేశంలో ఇప్పటి వరకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 6,53,25,779గా ఉంది.

సస్పెండ్ ఎంపీలకు టీ ఇచ్చిన డిప్యూటీ చైర్మన్, మా పోరాటం టీ కోసం కాదు..రైతుల కోసమన్న విపక్షాలు, రాత్రంతా మహాత్మాగాంధీ విగ్రహం సమీపంలో సస్పెన్షన్‌ ఎంపీలు

కాగా కరోనాతో తీవ్ర ప్రభావితమైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఈ రాష్ట్రంలో 2.9 లక్షల యాక్టివ్‌ కేసులున్నాయి. 98వేల యాక్టివ్‌ కేసులతో కర్ణాటక తరువాతి స్థానంలో ఉండగా 78 వేల కేసులతో ఏపీ తరువాతి స్థానంలో ఉంది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మెట్రోరైలు సర్వీసులు ప్రారంభించాక గడచిన రెండు వారాల్లో మాస్కు ధరించకుండా మెట్రోరైలు ఎక్కిన ప్రయాణికులకు ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) జరిమానాలు విధించింది.

కాగా సెప్టెంబరు 11 నుంచి 20వతేదీ వరకు 2,214 మంది ప్రయాణికులు మాస్కు లు ధరించకుండా మెట్రోరైలు స్టేషనుతోపాటు రైళ్లలో ఎక్కారని, వారికి జరిమానాలు విధించామని డీఎంఆర్సీ వెల్లడించింది. కరోనా నిబంధనల ప్రకారం మెట్రోరైలు ఎక్కే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. మరో 5వేల మందికి మాస్కు ధరించాలని కౌన్సెలింగ్ జరిపామని మెట్రోరైలు అధికారులు చెప్పారు. ఢిల్లీలోని 9 రైలు కారిడార్లలో ప్రయాణికులు మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరం నిబంధనలు పాటించేలా చూసేందుకు స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశామని మెట్రోరైలు అధికారులు చెప్పారు