Coronavirus Outbreak in India, Representational Image | PTI Photo

New Delhi, December 16: భారతదేశంలో ఇటీవల కాలంగా ప్రతిరోజు 30 వేల లోపు స్థిరంగా కొవిడ్19 కేసులు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో తొలి విడత టీకా పంపిణీ చేయబడుతుందన్న వార్తల నేపథ్యంలో మున్ముందు కేసుల సంఖ్య ఎలా ఉండబోతుందో చూడాలి. వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రజలు యధావిధిగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వైరస్ వ్యాప్తి మరింత తీవ్రతరం కాకుండా నియంత్రించాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 26,382 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం ఉదయం నాటికి 99,32,548కు చేరింది. నిన్న ఒక్కరోజే 387 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,44,096కు పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 33,813 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 94,56,449 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం దేశంలో 3,32,002ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update:

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 95.21% ఉండగా, ప్రస్తుతం తీవ్రత  (యాక్టివ్ కేసులు) 3.34%  శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.45% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక డిసెంబర్ 15 వరకు దేశవ్యాప్తంగా 15,66,46,280 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 10,85,625 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది

ఇక ఇప్పటికీ కరోనావైరస్ తీవ్రత ఎక్కువగా మహారాష్ట్రలోనే ఉంది.  అయితే ఆ రాష్ట్రంలోనూ ఆక్టివ్ కేసులు తగ్గుతుండటం ఊరట కలిగించే విషయం. ప్రస్తుతం మహారాష్ట్రలో ఆక్టివ్ కేసులు 72,458కు తగ్గగా, కొవిడ్ మరణాలు 48,339కు పెరిగాయి.