COVID-19 Outbreak. | (Photo Credits: IANS)

New Delhi, April 19: గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,334 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో భారతదేశంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 15,712 దాటింది. అంతేకాకుండా నిన్న ఒక్కరోజే 27 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు 2,230 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏప్రిల్ 19న విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 12,974 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు కోవిడ్-19తో మరణించిన వారి సంఖ్య 507కి చేరింది.

మహారాష్ట్రలో పరిస్థితి అదుపులోకి రావడం లేదు.ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య  3,648 దాటింది, ఇది దేశంలోనే అత్యధికం. శనివారం ఒక్కరోజే మహారాష్ట్రలో 328 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  ఆ తర్వాత న్యూ ఢిల్లీలో 1,707 కేసులు, మధ్యప్రదేశ్ లో 1,355, తమిళనాడులో 1,323, రాజస్థాన్ రాష్ట్రంలో 1,131 కేసులు ఇప్పటివరకు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

Here's the update:

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగానే నమోదయ్యాయి. తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 809కి చేరగా, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 647 కేసులు నమోదయ్యాయి. జ్వరం, దగ్గు, జలుబు మందులు కావాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకారం, శనివారం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 3,72,123 నమూనాలను పరీక్షించారు.

ఇప్పటివరకు దేశంలో వైరస్ సంక్రమణకు గురై చనిపోయిన వారిలో 75.3 శాతం మంది 60 ఏళ్లు పైబడినవారేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా 83 శాతం మందికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని పేర్కొంది భారతదేశంలో COVID-19 మరణాల రేటు సుమారు 3.3 శాతంగా ఉందని తెలిపింది. ఇక కరోనావైరస్ నేపథ్యంలో భారీ డిమాండ్ ఏర్పడిన హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్‌సిక్యూ) యొక్క దుష్ప్రభావాలపై పరిశోధనలు జరుగుతున్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.