New Delhi, December 4: భారతదేశంలో కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. అయినప్పటికీ వైరస్ వ్యాప్తి ఇప్పటికీ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అయితే రికవరీ రేటు మనదేశంలో మెరుగ్గా ఉండటం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 36,594 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయం నాటికి 95,71,559కు చేరింది. నిన్న ఒక్కరోజే 540 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,39,188కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,916 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 90,16,289 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,16,082 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India's COVID19 Update:
📍#COVID19 India Tracker
(As on 04 December, 2020, 08:00 AM)
➡️Confirmed cases: 95,71,559
➡️Recovered: 90,16,289 (94.20%)👍
➡️Active cases: 4,16,082 (4.35%)
➡️Deaths: 1,39,188 (1.45%)#IndiaFightsCorona#Unite2FightCorona#StaySafe pic.twitter.com/PV3DsVCs24
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) December 4, 2020
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 94.20% ఉండగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 4.35% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.45% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇక డిసెంబర్ 3 వరకు దేశవ్యాప్తంగా 14,47,27,749 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 11,70,102 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
ఇక కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో దేశంలోనే మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతుంంది. ఈ రాష్ట్రంలో ఆక్టివ్ కేసులు 86,612కు చేరగా, కొవిడ్ మరణాలు 47,472కు పెరిగాయి.
దేశంలో ప్రస్తుతం కొవిడ్19 వ్యాప్తి మరియు వ్యాక్సిన్ పై సమాచారానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అఖిలపక్షం నేతలతో భేటీ అవుతున్నట్లు సమాచారం.