COVID Outbreak- Representational Image (Photo Credits: IANS)

New Delhi, Mar 7: కరోనా నుంచి బయటపడిన ప్రజలను ఇప్పుడు మరో వైరస్ వణుకిస్తోంది. దేశంలో ప్రమాదకరస్థాయిలో ఈ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇది సాధారణ ఫ్లూ అయినప్పటికీ.. అప్రమత్తంగా ఉండాల్సిందేనని అంటున్నారు నిపుణులు. ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా మాట్లాడుతూ.. కరోనా కాకున్నా ఆ వైరస్‌లానే H3N2 ఇన్‌ఫ్లూయెంజా ప్రమాదకరస్థాయిలో విజృంభిస్తోందని హెచ్చరించారు.

పండుల సీజన్‌ వేళ అందరూ అప్రమత్తంగా ఉండాలని, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం కొత్త ఫ్లూ విజృంభిస్తోందని జ్వరాలు దడపుట్టిస్తున్నాయన్నారు. దగ్గు, జలుబు, తీవ్ర జ్వరంతో జనాలు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వైరస్ పరివర్తన చెందడం, ప్రజల రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు పెరుగుతున్నాయని డాక్టర్‌ గులేరియా అభిప్రాయపడ్డారు.

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న కొత్త ఫ్లూ, ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు, అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్‌ హెచ్చరికలు

చాలా ఏళ్ల కిందట.. H1N1 కారణంగా స్వైన్‌ ఫ్లూ మహమ్మారి విజృంభించింది. ఇప్పుడు దాని నుంచి పరివర్తనం చెందిన H3N2 వైరస్‌ విజృంభిస్తోంది. ఇది ఒక సాధారణమైన ఇన్‌ఫ్లూయెంజా జాతి. ప్రతీ వైరస్‌ లాగే.. ఇదీ పరివర్తనం చెందుతోంది. కానీ, H3N2 మ్యూటేషన్‌తో ఇన్‌ఫెక్షన్‌ త్వరగతిన వ్యాపిస్తూ.. ఎక్కువ కేసులను చూడాల్సి వస్తోంది. శ్వాస కోశ ఇబ్బందులు తలెత్తుతున్నాయని గులేరియా అన్నారు.

ఈ నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో కరోనా టైంలో వాడినట్లే మాస్కులు వాడాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కరోనా టైంలో పాటించిన జాగ్రత్తలను పాటిస్తే.. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చిన చెప్తున్నారు. అలాగే ఇష్టానుసారం యాంటీ బయోటిక్స్‌ వాడొద్దని ఇదివరకే ఐసీఎంఆర్‌ ప్రజలను హెచ్చరించిన సంగతి తెలిసిందే. వృద్ధులు, చిన్నారులతో పాటుగా గుండె, కిడ్నీ, ఇతరత్ర వ్యాధులు ఉన్నవాళ్లు సైతం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తరచుగా చేతులు కడుక్కోవాలి. భౌతిక దూరం కూడా కలిగి ఉండాలన్నారు.

ఒకే దేశం ఒకే ఆరోగ్యం, దేశంలో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం, ఆరోగ్యం & వైద్య పరిశోధనపై ప్రసంగించిన ప్రధాని మోదీ

కేసుల పెరుగుదల రెండు కారణాల వల్ల కావచ్చు - సంవత్సరంలో ఈ సమయంలో వాతావరణం మారినప్పుడు ఇన్‌ఫ్లుఎంజా వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే కోవిడ్ తర్వాత రద్దీగా ఉండే ప్రదేశాలలో ప్రజలు ముసుగులు ధరించరు కాబట్టి ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. కేసుల పెరుగుదల పెద్దగా ఉన్నా ఆసుపత్రిలో చేరడం వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాను భావించడం లేదని ఎయిమ్స్ మాజీ చీఫ్ అన్నారు.

ఇన్ఫ్లుఎంజా కేసులు గొంతు నొప్పి, దగ్గు, శరీర నొప్పులు, ముక్కు కారడంతో పాటు జ్వరంగా ఉన్నట్లు తెలిపారు. వైరస్ పరివర్తన చెందడం, దానిపై ప్రజల రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.