
Mumbai, Febaury 17: ఇకపై ఎటిఎంల్లో నగదు ఉపసంహరణలు (ATM Withdrawal) నిల్వ తనిఖీ చేసుకోవడం మరింత భారం అయ్యే సంకేతాలు కనబడుతున్నాయి. ఇంటర్‌చేంజ్ ఫీజులు (Interchange Fee) పెంచాలంటూ ఆర్బీఐకి ఏటీఎం ఆపరేటర్స్ అసోసియేషన్ (ATM Operators Association) విజ్ఞప్తి చేసింది. ఏటీఎంల నిర్వహణ సంస్థలు నష్టాల్లో చిక్కుకుంటున్నాయనీ.. నగదు విత్‌డ్రాలపై విధించే ఇంటర్‌చేంజ్ ఫీజులను పెంచడం ద్వారా వాటిని ఆదుకోవాలంటూ ఏటీఎం అసోసియేషన్ ఆర్బీఐని కోరింది.
రైల్వే ప్రయాణీకులకు హెల్త్ ఏటీఏం
ఆర్బీఐ (RBI) ఇటీవల పెంచిన భద్రతా ప్రమాణాల కారణంగా ఏటీఎంల (ATMs) నిర్వహణ ఖర్చు మరింత పెరిగిందనీ.. దీన్ని అధిగమించాలంటే తమకు ఆదాయం సమకూరే విధంగా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలని ఏటీఎం నిర్వహణ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.ఆర్బీఐ డేటా ప్రకారం దేశ వ్యాప్తంగా 2, 27, 000 ఏటీఎంలున్నాయి. వాటిలో 21 వేల 300 వైట్ లేబుల్ యంత్రాలు, మిగిలినవి సొంతంగా బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నవి ఉన్నాయి.
ఎస్బీఐ ఏటిఎంలలో క్యాష్ విత్‌డ్రాకు ఓటీపీ ఎంటర్ చేయాలి
ఈ అంశంపై ఆర్‌బిఐ కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఎటిఎంల వినియోగం, వ్యాప్తిని పెంచేందుకు ప్రతిపాదనల కోసం గతేడాది ఆర్‌బిఐ (Reserve Bank of India) ఓ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత డిసెంబరులో తమ ప్రతిపాదనలను రిజర్వ్ బ్యాంక్‌కు సమర్పించింది. అందులో ప్రధానంగా ఇంటర్‌ఛేంజ్ ఫీజులను పెంచాలని సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఎటిఎం భద్రత, నిర్వహణ ప్రమాణాలను ఆర్‌బిఐ పెంచిన నేపథ్యంలో ఎటిఎంల నిర్వహణ ఖర్చు పెరిగిందని ఇందులో పేర్కొంది. దీని వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని తెలిపింది. ఈ పరిణామాల వల్ల కొత్త ఎటిఎంలను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నామని తెలిపారు. అందుకే ఆదాయాన్ని పెంచుకోవాలను కుంటున్నామని చెప్పారు.
ప్రస్తుతం ఒక బ్యాంక్ కార్డును వేరే బ్యాంక్‌కు చెందిన ఎటిఎంల్లో వినియోగించినప్పుడు సదరు ఎటిఎం ఆపరేటర్‌కు ఖాతాదారుడు ఇంటర్‌ఛేంజ్ ఫీజు చెల్లించాల్సిన విషయం తెలిసిందే. వినియోగదారులకు ఐదు లావాదేవీలను ఉచితంగా అందిస్తూ ఆ పైన జరిగే లావాదేవీలకు కొంత మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నాయి. పరిమితి దాటిన తర్వాత చేసే నగదు లావాదేవీలపై రూ.15, నగదు రహిత లావాదేవీల సమాచారంపై రూ. 5 చొప్పున ఈ ఛార్జీలు అమల్లో ఉన్నాయి.
మరిన్నికొత్త రైళ్లు అందుబాటులోకి
పది లక్షల మంది జనాభా పైబడిన నగరాల్లో నగదు లావాదేవీలపై ఇంటర్చేంజ్ ఫీజు రూ.17గా విధించాలనీ... నగదు రహిత లావాదేవీలపై రూ.7 వరకు ఫీజు వసూలు చేయాలని కోరింది. గ్రామీణ, చిన్న తరహా పట్టణాల్లో ఈ మొత్తాలు వరుసగా రూ 18, రూ. 8గా నిర్ణయించాలని ఆర్బీఐని కోరింది. ఉచిత ట్రాన్సాక్షన్లను మాత్రం 6 వరకు ఉంచవచ్చునని పేర్కొంది. దీనిపై ఆర్బీఐ సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ మరింత భారంగా మారే అవకాశాలు ఉన్నాయి.