New Delhi, July 29: గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) ఐటీ రిటర్న్స్ దాఖలు (ITR filing) చేయడానికి మరో రెండు రోజుల టైం మాత్రమే ఉంది. ఆదివారంతో ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు (ITR filing deadline) ముగిసిపోనున్నది. అయితే, ఆదివారం బ్యాంకులకు సెలవు దినం. వేతన జీవులు తమ ఐటీఆర్ దాఖలు చేయడానికి డెడ్ లైన్ సమీపించే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. చివరి రోజుకు ముందే ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. ఈ ఏడాది ఐటీఆర్ ఫైలింగ్ గడువు (ITR filing deadline), బ్యాంకు సెలవు దినం(bank holiday) ఒకేసారి వచ్చినా వేతన జీవులు తమ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయొచ్చు. కానీ రిటర్న్స్‌కు సంబంధించిన పత్రాలను వేతన జీవులు తమ బ్యాంకు శాఖల్లో ఫిజికల్‌గా (Physical) సబ్మిట్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. బ్యాంకులకు సెలవు దినం కావడంతో వారమంతా సజావుగా సాగిన ఆన్‌లైన్ (online)లావాదేవీలు ఆదివారం (Sunday) సజావుగా సాగకపోవచ్చు. చివరి క్షణంలో ఐటీఆర్‌లు దాఖలు చేయడానికి వేతన జీవులు ముందుకు వస్తే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.
వేతన జీవికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో బ్యాంక్ పాత్ర కీలకం. ఆన్‌లైన్ సేవలు అందుబాటులో లేకపోతే చలాన్ ద్వారా ఆదాయం పన్ను చెల్లించడానికి బ్యాంకుకు వెళ్లాల్సి రావచ్చు. ఫామ్-16 (Form 16) పొందాలన్నా బ్యాంకు శాఖను సందర్శించాల్సిందే. ఆన్‌లైన్‌లో టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) సర్టిఫికెట్ అందుబాటులో ఉండొచ్చు.. ఉండకపోవచ్చు.
ఇప్పటికి ఐటీఆర్ సబ్మిట్ (ITR) చేయడానికి శనివారం వర్కింగ్ డే. వ్యక్తులుగా వేతన జీవులు త్వరితగతిన తమ రిటర్న్స్ సబ్మిట్ చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ సకాలంలో ఫైల్ చేయలేకపోతే, పెనాల్టీ చెల్లించడానికి సిద్ధం కావాల్సిందే. వేతన జీవుల ఆదాయం రూ.5 లక్షలు దాటితే రూ.5000, రూ.5లక్షల్లోపు రూ.1000 పెనాల్టీ చెల్లించాలి.