Jaipur bomb blast 2008 All Four Convicted In Serial Blasts Case That Killed Over 70 People Sentenced To Death (Photo-PTI)

Jaipur, December 21: 2008 లో జైపూర్‌లో వరుస బాంబు పేలుళ్లకు(Jaipur Bomb Blast 2008) పాల్పడినట్లు తేలిన నలుగురికి రాజస్థాన్ కోర్టు ( Jaipur special court) మరణశిక్ష విధించింది. ఒక వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించారు. 2008 మే నెలలో జైపూర్‌ పాత నగరంలోని హనుమాన్‌ ఆలయ సమీపంలో 9 వరుస పేలుళ్లు జరిగాయి. 2 కిలోమీటర్ల పరిధిలో 15 నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 72 మంది మృతి చెందగా, 170 మంది గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మహ్మద్ సైఫ్, సర్వార్ ఆజ్మీ, సల్మాన్, సైఫూర్ రెహ్మాన్ లను దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం వారికి ఉరిశిక్ష విధించింది.

షాబాజ్ హుస్సేన్ నిర్దోషిగా ప్రకటించబడ్డాడు. మరో ముగ్గురు నిందితులు ఢిల్లో లోని తీహార్ జైలులో ఉన్నారు. ఈ కుట్రకు సూత్రధారి ఉత్తరప్రదేశ్‌ లోని అజమ్‌ గఢ్ కు చెందిన మొహమ్మద్ అతిన్. అతను ఢిల్లీ లో జరిగిన బాట్ల హౌస్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. దోషులు నలుగురు ఉత్తర ప్రదేశ్ నివాసితులు. వారు అతిన్ సూచనల మేరకు పేలుళ్లు జరిపారు. వారు పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి నగరంలోని తొమ్మిది ప్రదేశాలలో పేలుళ్లు జరిపారు. ఈ పేలుళ్లు రాత్రి 7.20 నుంచి 7.45 మధ్య సంభవించాయి.

Update by ANI

దీనిపై ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. సెషన్స్‌ జడ్జి అజయ్‌ కుమార్‌ శర్మ (Special Judge Ajay Kumar Sharma)శుక్రవారం తుదితీర్పు వెలువరించారు. దోషులకు రూ.50 వేల జరిమానా విధించారు. ‘వేర్వేరు ప్రాంతాల్లో బాంబులు ఏర్పాటు చేసినందుకు ఐపీసీ 302 సెక్షన్‌ కింద నలుగురు దోషులకు మరణశిక్ష విధించారు’ అని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీచంద్‌ తెలిపారు.

ఈ తీర్పుపై హైకోర్టుకు వెళతామని దోషుల తరఫు లాయర్‌ చెప్పారు. రెండు రోజుల క్రితం మహమ్మద్‌ సైఫ్, మహమ్మద్‌ సర్వార్‌ అజ్మీ, మహమ్మద్‌ సల్మాన్, సైఫురీష్మన్‌ అనే నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పునివ్వగా మరో నిందితుడు షాబాజ్‌ హుస్సేన్‌ను బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద నిర్దోషిగా విడుదల చేసింది.