Jammu And Kashmir: స్వాతంత్ర్య సంబరాల వేళ ఉగ్రవాదుల కాల్పులు, నౌగామ్ ప్రాంతంలో పోలీసులపై కాల్పులకు తెగపడిన టెర్రరిస్టులు, ఇద్దరు పోలీసులు మృతి, ఒకరికి గాయాలు
File image of security personnel in Jammu & Kashmir | (Photo Credits: IANS)

Srinagar, August 14: దేశమంతా స్వాతంత్ర్య సంబరాల్లో మునిగినన వేళ జమ్ముకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్ శివారులోని నౌగామ్ ప్రాంతంలో (Nowgam in Srinagar) శుక్రవారం ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులకు (Terrorists Attack Police Party) తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా ఒకరికి గాయాలైనట్లు సమాచారం. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందు ఈ ఘటన జరగడం స్థానికంగా అలజడి సృష్టించింది. గురువారం జమ్ము కశ్మీర్ పోలీసులు, ఆర్మీకి చెందిన 50 రాష్ట్రీయ రైఫిల్స్ (ఆర్ఆర్), 130 సీఆర్పీఎఫ్ బెటాలియన్ సిబ్బందితో కలిసి దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవాండిపోరాలో దాక్కున్న ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఉగ్ర దాడి జరిగిన తర్వాత కాల్పుల్లో గాయపడిన ఇద్దర్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో వీరు అమరులయ్యారని ఉన్నతాధికారులు ప్రకటించారు. ‘‘నౌగాన్ బైపాస్ రోడ్డులో పోలీసులపై విచక్షణరహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించాం. చికిత్స పొందుతున్న సమయంలో ఇద్దరు పోలీసులు అమరులయ్యారు.’’ అని ఉన్నతాధికారులు ప్రకటించారు. విషమంగానే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం, వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నామని తెలిపిన ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరెల్‌ ఆసుపత్రి వైద్యులు

మృతులను 715 ఐఆర్‌పి 20 బెటాలియన్‌కు చెందిన ఇష్ఫాక్ అయౌబ్, 307 ఐఆర్‌పి 20 బెటాలియన్‌కు చెందిన ఫయాజ్ అహ్మద్‌గా గుర్తించారు.గాయపడిన సెలెక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్ మహ్మద్ అష్రాఫ్ కుడి చేతిలో బుల్లెట్ గాయాలయ్యాయి.పోలీసులపై దాడికి జైష్-ఎ-ముహమ్మద్ గ్రూపే (Jaish-e-Muhammad) కారణమని కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ అన్నారు. దాడి చేసిన వారిని పట్టుకోవడానికి ఒక ఆపరేషన్ జరుగుతోందని, అదనపు దళాలను మోహరించామని తెలిపారు. ఈ మేరకు కాశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు.