Srinagar, March 22: జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య సోమవారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. షోపియాన్ జిల్లాలోని మునిహల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా భద్రతా దళాలపై ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు చనిపోయారు.
వారిలో ఇద్దరు లష్కరే తాయిబాకు సంబంధించినవారిగా గుర్తించారు. మరో ఇద్దరు ఏ సంస్థకు చెందినవాడనే విషయం ఇంకా తెలియరాలేదని కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఇందుకు సంబంధించిన వివరాలను జమ్మూ కాశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే ఉగ్రవాదుల నుంచి కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Here's ANI Update
Jammu & Kashmir: Joint operation underway with a total of three terrorists eliminated in an encounter with security forces in Shopian. Two of them were associated with Lashkar-e-Taiba. More details awaited.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/JYHUa2jBdW
— ANI (@ANI) March 22, 2021
కమ్యూనిస్టు చైనా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిని కలిగి ఉండగా, భారత్ ఈ విషయంలో నాలుగో స్థానంలో ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. మొత్తం 100 పాయింట్లకు చైనా 82 పాయింట్లతో సూచికలో అగ్ర స్థానంలో నిలిచిందని పేర్కొంది. అమెరికా మిలటరీ బడ్జెట్ భారీగా ఉన్నప్పటికీ, 74 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తర్వాత 69 పాయింట్లతో రష్యా మూడో స్థానంలో, 61 పాయింట్లతో భారత్ నాలుగో స్థానంలో ఉన్నాయి.
ఈ పట్టికలో యూకే 43 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచినట్లు మిలటరీ డైరెక్ట్ అనే డిఫెన్స్ వెబ్‌సైట్ ఆదివారం ఈ వివరాలను విడుదల చేసింది. మిలటరీ బడ్జెట్, యాక్టివ్, ఇన్ యాక్టివ్ సైనికుల సంఖ్య, త్రివిధ దళాలు, అణు సామర్థ్యం, సరాసరి వేతనాలు, ఆయుధ సామగ్రి వంటి వివరాలను పరిగణనలోకి తీసుకుని ‘అల్టిమేట్ మిలటరీ స్ట్రెన్త్ ఇండెక్స్’ను రూపొందించినట్లు తెలిపింది. ప్రపంచంలోనే భారీ మిలటరీ బడ్జెట్‌ను కలిగిన అమెరికా ఏడాదికి 732 బిలియన్ డాలర్లను వెచ్చిస్తుండగా చైనా 261 బిలియన్ డాలర్లు, భారత్ 71 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నాయి.