Jasmine Flowers: కిలో మల్లెపూలు కావాలంటే రూ.3 వేలు చెల్లించాలి, వర్షాల దెబ్బకు అమాంతంగా పెరిగిన మల్లెపూల ధరలు, తమిళనాడులో సామాన్యులకు తప్పని ఇబ్బందులు
jasmine flowers touches Rs 3000 per kg following widespread rain (Photo-ANI)

Madurai, December 4: ఆయా సీజన్ కు అనుకూలంగా పండ్లు, పూలకు గిరాకీ ఉంటుంది. గిరాకీ తగ్గట్టుగానే ధర కూడా ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం మల్లెపూల ధర ఊహించని రీతిలో భారీగా పెరిగింది. వందల్లో కాదు ఏకంగా వేలల్లో పెరిగింది. కిలో మల్లెపూల ధర ఏకంగా రూ. 3వేల రూపాయలకు చేరింది. ఇది ఎక్కడో 00కాదు మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడు(Tamil Nadu)లోని మధురై(Madurai)లో.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దీంతో వారం క్రితం కిలో మల్లెపూలకు రూ. 1500 వరకూ ఉన్న ధర ఇప్పుడు రెట్టింపైంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో మల్లెపూల(Jasmine Flowers)కు డిమాండ్ అధికంగా ఉందంటున్నారు వ్యాపారులు. ఇదే సమయంలో సరఫరా తగ్గడంతో పూల ధరలు భారీగా పెరిగాయంటున్నారు. సాధారణంగా మార్కెట్ కు వచ్చే పూలలో సగం కూడా రావడం లేదంటున్నారు. రోజుకు ఐదు నుంచి ఆరు కిలోల పూలను అమ్మేవారు ప్రస్తుతం రెండు కిలోలను కూడా అమ్మేపరిస్థితి లేదంటున్నారు.

మధురైలో మల్లెపూల ధర

వర్షాల కారణంగానే మల్లెపూల ధరలు ఆకాశాన్నంటాయని పూల వ్యాపారి శ్రవణ కుమార్‌ మీడియాకు తెలిపారు. వారం రోజుల క్రితం కిలో మల్లెపూల ధర(Jasmine Flowers Price) రూ. 1500 నుంచి 1800ల మధ్య ఉన్నదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడేమో కేజీ మల్లెపూల ధర రూ. 3 వేలు (flower touched Rs 3,000 per kg )కావడంతో.. సామాన్యులు కొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో మల్లెపూలకు మంచి డిమాండ్‌ ఉంది.

మల్లెపూల ధర ఆకాశానికి ఎగబాకడంతో..పెళ్లిళ్లు, పేరంటాలు ముందే ఏర్పాటు చేసుకున్న వారు ముక్కున వేలేసుకుంటున్నారు. పూల ధరే మూడువేల రూపాయలు దాటితే..పెళ్లి పందిళ్లు..వధూవరులను ఎలా అలంకరించాలని వారు అంటున్నారు.