Jharkhand Polls: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు, తొలి విడతలో 62.87 శాతం పోలింగ్ నమోదు, 81 అసెంబ్లీ స్థానాలకు గాను 13 అసెంబ్లీ స్థానాలకు  పోలింగ్‌, ఐదు విడతలుగా ఎన్నికలు, గన్‌తో హల్ చల్ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి త్రిపాఠి
Elections | Image used for representational purpose | (Photo Credits: PTI)

Patna, December 1: జార్ఖండ్ ( Jharkhand) రాష్ట్రంలో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం నాడు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ శాతం 62.87గా నమోదైంది. ఆరు జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. 37 లక్షల మంది ఓటర్లు మొదటి విడతలో తమ ఓటు హక్కును వినుయోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వినయ్ కుమార్ చౌబే తెలిపారు.

ఇటీవల నక్సలైట్లు (Naxals)దాడులు చేసిన నేపథ్యంలో లతేహర్, మణిక నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఎన్నికలకు నవంబర్‌ 1న నోటిఫికేషన్‌ జారీ చేయగా.. ఐదు విడతల్లో పోలింగ్‌ జరుగనుంది. ఐదు విడుతలుగా జరుగనున్న ఈ ఎన్నికలకు వేర్వేరు తేదీల్లో నోటిఫికేషన్‌, నామినేషన్ల స్వీకరణ, నామినేషన్‌ విత్‌డ్రా, పోలింగ్‌ తేదీలు ఉన్నాయి. కాగా.. తుది ఫలితాలు డిసెంబర్‌ 23న విడుదలవుతాయి.

Final Voter Turnout

కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ఘర్షణకు దారి తీసింది. పోలింగ్ బూతుల వద్ద బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. తోపులాట జరగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి గన్ తీసుకొని వచ్చి హల్‌చల్ చేశాడు. పలామూ నియోజకవర్గంలోని కోసియారా గ్రామంలో ఎన్నికల ప్రక్రియ పరిశీలించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి త్రిపాఠీ వచ్చారు. ఆ సమయంలో బీజేపీ అభ్యర్థి అలోక్ చౌరాసియా వర్గీయులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది.

Watch Video of Congress Candidate Brandishing Gun

ఆ వెంటనే త్రిపాఠి (Congress candidate KN Tripathi) తన వద్ద ఉన్న గన్ చేతిలోకి తీసుకొని అక్కడి వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు ఆయన్ను అక్కడి నుంచి పంపించేశారు. గన్ బయటకు తీయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీచేసింది.