Rape Representative image.

Ranchi, July 6: అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన IAS officer దారి తప్పాడు. ఐఐటీ విద్యార్ధినిపై లైంగిక వేధింపుల‌కు పాల్పడ్డాడు. ఐఏఎస్ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో ఈ దారుణ ఘ‌ట‌న (Jharkhand Shocker) జ‌రిగింది. అదుపులోకి తీసుకున్న అధికారిని స‌బ్ డివిజ‌న‌ల్ మేజిస్ట్రేట్ స‌య్య‌ద్ రియాజ్ అహ్మ‌ద్‌గా గుర్తించారు. మ‌హిళా పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైన అనంత‌రం సోమ‌వారం రాత్రి రియాజ్ అహ్మ‌ద్‌ను క‌స్ట‌డీలోకి తీసుకున్నామ‌ని ( IAS officer arrested) ఎస్‌పీ అమ‌న్ కుమార్ తెలిపారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) సయ్యద్ రియాజ్ అహ్మద్‌ను స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది.

2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిపై ఐపీసీ సెక్షన్లు 354ఏ (లైంగిక వేధింపులు) మరియు 509 (మహిళ యొక్క అణకువను కించపరిచే పదం, సంజ్ఞ లేదా చర్య) కింద మహిళ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఫిర్యాదు మేరకు మొదట కేసు నమోదు చేయబడిందని అమన్ కుమార్ పిటిఐకి తెలిపారు. కేసు ఏంటంటే.. ఐఐటీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌లో ఒక‌రైన బాధితురాలు శిక్ష‌ణ నిమిత్తం జార్ఖండ్‌లోని ఖుంటికి వ‌చ్చారు.

నీ భార్యను పంపితే నా భార్యను పంపుతా, తన సోదరుడితో పడుకోవాలని భార్యకు ఓ భర్త వేధింపులు, తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి

ఐఐటీ విద్యార్ధుల కోసం శ‌నివారం రాత్రి డిప్యూటీ డెవ‌ల‌ప్‌మెంట్ క‌మిష‌న‌ర్ నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో అతిధులంద‌రికీ మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేశారు. ఈ పార్టీలో ఆమె ఒంట‌రిగా ఉండటాన్ని గమనించి ఐఏఎస్ అధికారి లైంగికంగా ( IIT student at dinner party) వేధించారు. ప్రాధ‌మిక ద‌ర్యాప్తులో బాధితురాలి ఆరోప‌ణ‌లు వాస్త‌వ‌మ‌ని వెల్ల‌డ‌య్యాయ‌ని ఎస్‌పీ చెప్పారు. విద్యార్ధినిని వైద్య ప‌రీక్ష‌ల‌కు త‌ర‌లించామ‌ని ఈ అంశంపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని తెలిపారు.