Jamshedpur, Nov 7: జార్ఖండ్‌లోని టాటానగర్ స్టేషన్‌లో నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ జనరల్ కంపార్ట్‌మెంట్ నుండి రూ.50 కోట్లకు పైగా (Rs 50 cr on train) విలువైన కొండచిలువలు, అరుదైన జాతుల పాములు, ఊసరవెల్లులు తదితరాలతో ప్రయాణిస్తున్న మహిళను అరెస్టు చేశారు.రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జిఆర్‌పి), క్రైమ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (సిఐబి) సంయుక్త బృందం ఈ మహిళను అరెస్టు చేసింది. స్వాధీనం చేసుకున్న జంతువులను అటవీ శాఖకు అప్పగించనున్నారు. నిందితురాలిని పూణేకు చెందిన దేవి చంద్రగా గుర్తించారు.
నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ జనరల్ కంపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద మహిళ ప్రయాణిస్తున్నట్లు ఖరగ్‌పూర్ రైల్వే డివిజన్ నుండి సమాచారం అందుకున్న పోలీసులు చర్యలు తీసుకున్నారు. రైలు టాటానగర్ స్టేషన్‌కు చేరుకోగానే మహిళను గుర్తించి వెతికారు. బ్యాగ్‌లో ఊసరవెల్లులు, సాలెపురుగులతో పాటు మొత్తం 28 పాములను (Woman carrying 28 pythons) బృందం స్వాధీనం చేసుకుంది.
విచారణలో, నాగాలాండ్‌లోని ఒక వ్యక్తి ఢిల్లీకి డెలివరీ చేయడానికి రూ. 8,000 ఇచ్చి బ్యాగ్‌ను ఇచ్చాడని మహిళ వెల్లడించింది. ఆమె నాగాలాండ్ నుండి రైలులో గౌహతికి చేరుకుంది అక్కడి నుంచి హౌరా చేరుకుంది, అక్కడ నుండి రైలులో ఢిల్లీకి చేరుకుంది.తనకు బ్యాగ్ ఇచ్చిన వ్యక్తితో టచ్‌లో ఉన్నానని తెలిపింది. నిందితులను పట్టుకునేందుకు దాడులు నిర్వహిస్తున్నారు.
Here's Video
जमशेदपुर के टाटानगर स्टेशन से आरपीएफ ने नीलांचल एक्सप्रेस से महिला को वन्य जीव प्राणियों के साथ गिरफ्तार किया। महिला के पास से बरामद बैग से काफी मात्रा में वन्य जीव प्राणी पाए गए। जिनमें सांप, गिरगिट, मकड़ी और बीटल के अलावा अन्य शामिल है। सभी वन्य प्राणी विदेशी है। pic.twitter.com/prjgdHuxEN
— NBT Bihar (@NBTBihar) November 7, 2022
బ్యాగ్‌లోంచి సరీసృపాలను బయటకు తీయడానికి ఆర్పీఎఫ్ పాములు పట్టేవారిని పిలిపించింది. ఒక్కొక్కటి రూ.25 కోట్ల విలువైన రెండు సాండ్ బోయాలు, అల్బినో కొండచిలువలను రక్షించారు. ఇవి కాకుండా తొమ్మిది బాక్సుల్లో 19 బాల్ కొండచిలువలు, నాలుగు ఎర్ర కొండచిలువలు లభ్యమయ్యాయి. మరో పెట్టెలో పన్నెండు ఊసరవెల్లులు, బీటిల్స్, సాలెపురుగులు కనిపించాయి. వీటిలో ఒక పాము, ఎనిమిది ఊసరవెల్లులు చనిపోయాయి. ఈ జీవుల విషాన్ని మత్తు పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు.