Mumbai November 28: యూజర్స్ కు షాక్ ఇచ్చింది జియో(Jio). ఇప్పటికే టారిఫ్‌లను పెంచిన ఎయిర్‌టెల్(Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) బాటలోనే ప్రీపెయిడ్(Prepaid) ఛార్జీలను సవరించింది జియో. 20 శాతం మేర ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ఛార్జీలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. టెలికాం(Telecom) పరిశ్రమను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఛార్జీలను పెంచుతున్నట్లు జియో ప్రకటనలో ఒక తెలిపింది.
సవరించిన అన్ని ప్లాన్ల వివరాలను ప్రకటించింది. జియో ఫోన్ సహా, అన్‌లిమిటెడ్(Unlimited) ప్రీపెయిడ్, డేటా-ఆన్స్ ధరలు కూడా పెరిగాయి. జియో ఫోన్ కోసం అందుబాటులో ఉన్న బేసిక్ ప్లాన్‌కు రూ.75 బదులు ఇకపై రూ.91 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ.199 ప్లాన్ (28 రోజులకు 1.5జీబీ/రోజుకు) ధరను రూ.239కు జియో పెంచింది. అలాగే, రూ.444 ప్లాన్‌కు రూ.533, రూ.555 ప్లాన్‌కు రూ.666 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
అటు బీఎస్‌ఎన్‌ఎల్ కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ స్కీమ్‌ను ఉపసంహరించుకుంది. ఇలా అన్ని మొబైల్ నెట్‌వర్క్ లు ప్రీ పెయిడ్ ఛార్జీలు పెంచడంతో సామాన్యులపై భారం పడుతోంది.