JioPhone Next (Photo Credits: Google)

రిలయన్స్ నుంచి రాబోతున్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 'జియోనెక్ట్స్‌' ఫీచర్స్ విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ (Jio Phone Next Features Leak) అయ్యాయి. ఇప్పటికే జియో ఫోన్‌ వినాయక చవితికి విడుదల రావాల్సి ఉండగా.. సెమీ కండక్టర్ల కొరత కారణంగా దీపావళికి వాయిదా వేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

అయితే, త్వరలో లాంచ్ కానున్న ఈ ఫోన్‌ (Jio Phone Next ) ధర ఎంత ఉంటుంది? పెరిగిన ఫోన్‌ కాంపోనెట్స్‌ ధరల కారణంగా.. గతంలో అనౌన్స్‌ చేసిన ధరకే వస్తుందా? లేదంటే ప్రైస్‌ తగ్గుతుందా? ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. దీపావళికి రోజున (నవంబర్ 4న) జియోఫోన్ నెక్ట్స్ మొబైల్ ను విడుదల చేస్తామని రిలయన్స్ జియో ధృవీకరించింది.

ప్రపంచంలోనే అత్యంత చవక స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొన్న జియో నెక్ట్స్‌ (JioPhone Next) లాంచింగ్ తేదీ వాయిదా పడిన సంగతి విదితమే. రిలయన్స్‌ వార్షిక సమావేశంలో వినాయక చవితికి తమ ఫోన్‌ను లాంఛ్‌ చేస్తామని ఆ కంపెనీ చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ పేర్కొన్నారు. సెర్చింజ‌న్ గూగుల్‌తో క‌లిసి అత్యంత చౌక స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ నెక్ట్స్‌ను డెవ‌ల‌ప్‌చేశామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. కానీ ఆ ఫోన్‌ను దీపావ‌ళి క‌ల్లా విప‌ణిలోకి (JioPhone Next Roll-Out Before Diwali 2021) తీసుకొస్తామ‌ని రిల‌య‌న్స్ జియో ప్ర‌క‌టించింది.

దీపావళికి జియో అత్యంత చవక స్మార్ట్‌ఫోన్‌, సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌తతో ఫోన్ లాంచింగ్ వాయిదా, జియోఫోన్ నెక్ట్స్ ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

ప‌రిమితంగా కొంద‌రు యూజ‌ర్ల‌తో జియో నెక్ట్స్ ఫోన్ టెస్టింగ్ జియో-గూగుల్ మొద‌లు పెట్టాయి. వారి నుంచి వ‌చ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఫోన్‌లో మ‌రికొన్ని ఫీచ‌ర్లు తీసుకొస్తాం. దీపావళి క‌ల్లా ఈ ఫోన్‌ను మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉంచ‌డానికి య‌త్నిస్తున్నాం. అప్పటికైనా ఇప్పుడు వెంటాడుతున్న‌ సెమీకండక్టర్ల కొరత కూడా తీరుతుందని భావిస్తున్నాం’ అని రెండు కంపెనీలు ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న చేశాయి.మ‌రిన్ని ఫీచ‌ర్ల‌ను జ‌త క‌లిపేందుకు జాప్యం అవుతుంద‌ని జియో చెబుతున్నా.. సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌తే (Global Chip Shortages) దీనికి కార‌ణ‌మ‌ని వార్తలు వెలువడ్డాయి.

జియో ఫోన్‌ ఫీచర్స్(అంచనా)

5.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 చిప్ సెట్

అడ్రినో 306 జీపీయు

2500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ

8 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా

13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా

స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ లాంగ్వేజ్

ఆండ్రాయిడ్ గో ఓఎస్

ధర - రూ.3,499