JNU Students Protest: ఫీజుల పెంపుపై గర్జించిన జెఎన్‌యూ విద్యార్థులు, ఆందోళనలతో అట్టుడికిన వర్శిటీ, పాక్షికంగా వెనక్కి తగ్గిన జెఎన్‌యూ పాలక మండలి, ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పిన స్టూడెంట్స్ యూనియన్
Students of Jawaharlal Nehru University (JNU) participate in a demonstration (Photo Credits: IANS)

New Delhi, November 13: దిల్లీలోని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (Jawaharlal Nehru University) లో హాస్టల్ ఫీజుల పెంపు నిర్ణయం పట్ల విద్యార్థుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అయింది. దేశ రాజధానిలో విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతో జెఎన్‌యూ (JNU) పరిపాలన విభాగం బుధవారం దిగివచ్చి హాస్టల్ ఫీజు పెంపును పాక్షికంగా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అలాగే పేద మరియు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల (EWS- Economically Weaker Sections)కోసం రాయితీలు మరియు ఆర్థిక సహాయం అందించేందుకు ఒక పథకాన్ని ప్రతిపాదించింది.

హాస్టల్ నిర్వహణ వ్యయాలను విద్యార్థుల నుంచే వసూలు చేయాలనే ఉద్దేశ్యంతో జెఎన్‌యూలో వార్షిక ఫీజును భారీగా పెంచారు. హాస్టల్ ఫీజుకు, మెస్ ఫీజులు అలాగే భద్రతాపరమైన ఫీజులు అన్నీ కలిపి ఉన్న ఫీజులపై ఏకంగా 400 శాతం పెంచేశారు.. రూ. 30 వేల నుంచి రూ. 70 వేలకు ఫీజులు పెంచారు. అంతేకాకుండా హాస్టల్ సమయాలను కూడా పరిమితం చేశారు. లైబ్రరీ- రీడింగ్ రూంలను రాత్రి 11 గంటలకే మూసివేయడం, నిర్దేషించిన బట్టలనే విద్యార్థులు వేసుకోవాలని కొత్త నిబంధనలు చేర్చారు. ఈ కొత్త నిబంధనలు, ప్రతిపాదనలకు జెఎన్‌యూ పాలక మండలి గత నెల అక్టోబర్ 28న ఆమోదముద్ర వేసింది. దీంతో అప్పట్నించీ వర్శిటీలో ఆందోళనలు మొదలయి అవి నేటికి తారాస్థాయికి చేరాయి. విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. పోలీసులు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో, ఆగ్రహ జ్వాలలు పెరిగి వర్శిటీ యుద్ధభూమిగా తయారైంది.  విద్యార్థి లోకానికి 'రియల్ కామ్రెడ్' అతడు, చదవండి!

దీంతో హాస్టల్ ఫీజు మరియు ఇతర నిబంధనలను వెనక్కి తీసుకుంటున్నాము మరియు EWS కేటగిరీ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే పథకాన్ని ప్రతిపాదిస్తున్నాం, ఇక విద్యార్థులు ఆందోళన విరమించి తరగతులకు హాజరు కావాల్సిందిగా కేంద్ర విద్యా కార్యదర్శి ఆర్. సుబ్రహ్మణ్యం కోరారు.

JNU New Fee Structure:

Rent For Old Fee Earlier Announced Fee New Fee
Single room seater Rs 20 Rs 600 Rs 200
Double room seater Rs 10 Rs 300 Rs 100
Security deposit for mess Rs 0 Rs 5,500 Rs 5,500
Utility charges Rs 0 Rs 1700 Rs 1700

 

సింగిల్ లేదా డబుల్ సీటర్ గదుల కోసం ఫీజుల్లో ప్రతిపాదించిన పెంపును జెఎన్‌యు  తగ్గించినప్పటికీ, మెస్ ఛార్జీలు, ఇతర సదుపాయాలు మరియు సెక్యూరిటీ డిపాజిట్‌కు సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆందోళన విరమించేది లేదని జవహర్‌లాల్ నెహ్రూ స్టూడెంట్స్ యూనియన్ (JNUSU) స్పష్టం చేసింది.