రేషన్ స్కామ్ కేసులో పశ్చిమ బెంగాల్ మంత్రి (Bengal minister), టీఎంసీ నేత జ్యోతిప్రియ మల్లిక్ (Jyotripriya Mallick)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో రేషన్ పంపిణీ స్కామ్‌కు (ration distribution scam case) సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
ఈ క్రమంలో జ్యోతిప్రియ మల్లిక్ గతంలో ఆహార మంత్రిగా ఉన్న సమయంలో రేషన్ పంపిణీ స్కామ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మల్లిక్‌ను ఈడీ విచారించింది. దాదాపు 20 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున ఆయన్ని తన నివాసంలోనే అరెస్టు చేసినట్లు ఈడీ వెల్లడించింది.
మరోవైపు మల్లిక్ అరెస్ట్‌పై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee ) స్పందించారు. ఈడీ విచారణలో మంత్రి ఆరోగ్యం క్షీణిస్తే అధికారులే బాధ్యత వహించాలని అన్నారు. ఈ దాడుల వల్ల మంత్రికి ఏమైనా అయితే.. బీజేపీ, దర్యాప్తు సంస్థలపై కేసులు పెడతామని హెచ్చరించారు.
Here's Video
#WATCH | Kolkata: West Bengal minister Jyotipriya Mallick has been arrested by ED in connection with an alleged case of corruption in rationing distribution.
He says, "I am the victim of a grave conspiracy." pic.twitter.com/gARyddVT41
— ANI (@ANI) October 26, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)