Tamil Nadu BJP chief K Annamalai (Photo Credits: X/ANI)

Chennai, DEC 26: అల్లు అర్జున్(Allu Arjun) వివాదంపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై(Annamalai) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సూపర్ స్టార్ ఎవరు అనే విషయంలో నటుడు అల్లు అర్జున్ తో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పోటీపడేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేశారు. రాష్ట్రంలో అన్ని విషయాలు వదిలేసి రేవంత్ రెడ్డి నటులతో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే? 

తెలంగాణలో ప్రధాన నటుడు ఆయనే అని, సీఎం పాత్రలో కూడా ఆయన బాగా నటిస్తున్నారని విమర్శించారు. ఆయన రాజకీయాల కోసం ఒకరిని బలిపశువును చేయడం, వేధించడం సరికాదని అన్నామలై హితవు పలికారు.

K Annamalai on Sandhya Theatre Incident

 

పుష్ప-2 ప్రీమియర్ షో(Pushpa-2 Premiere Show) సందర్భంగా సంధ్య థియేటర్(Sandhya Theater) వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై తిరిగి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించడంతో ఈ వివాదం కాస్త దేశవ్యాప్త చర్చకు దారి తీసింది.