Kalyan Singh (Photo Credits: ANI)

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయన లైఫ్‌ సేవింగ్ సపోర్ట్‌పై ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ‘‘కల్యాణ్‌సింగ్‌జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం సాయంత్రం నుంచి ఆయనను లైఫ్‌ సేవింగ్ సపోర్ట్‌పై ఉంచాం. సీనియర్ వైద్యుల బృందం ఆయన ఆరోగ్య స్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తోందని ఆసుప్రతి వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి.

89 ఏళ్ల కల్యాణ్‌ సింగ్‌ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నెల 4వ తేదీన ఆయన ఆరోగ్యం క్షీణించడంతో లఖ్‌నవూలోని సంజయ్‌గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చేర్చారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

Here's ANI Update: 

మంగళవారం ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ ఆసుపత్రికి వెళ్లి కల్యాణ్‌సింగ్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యలను అడిగి తెలుసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కల్యాణ్‌సింగ్‌.. బీజేపీ హయాంలో ఉత్తరప్రదేశ్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2014 నుంచి 2019 వరకు రాజస్థాన్‌కు గవర్నర్‌గానూ పనిచేశారు.