New Delhi, Sep 26: . వివాదాస్పద రైతు చట్టాలపై తాను చేసిన వ్యాఖ్యలు చాలామందిని అసంతృప్తి, బాధకు గురి చేశాయని, దీనికి తనను క్షమించాలని ఆమె కోరారు. ‘కొద్ది రోజుల క్రితం రైతు చట్టాలపై మీడియా నన్ను కొన్ని ప్రశ్నలు వేసింది. గతంలో రద్దు చేసిన మూడు రైతు చట్టాలను తిరిగి తేవాలని నేను ప్రధాని మోదీని కోరుతానని చెప్పా.
అయితే నేను చేసిన ఈ ప్రకటన చాలామందిని బాధించింది. నేను నా ప్రకటనను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెబతున్నా. నేనొక బీజేపీ కార్యకర్తను. నేను చేసే ప్రకటనలు పార్టీ అభిప్రాయాన్ని ప్రతిబింబించేవిగా ఉండాలి తప్ప, వ్యక్తిగతంగా ఉండకూడదు’ అని ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కాగా, కంగనా చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవని, వాటికి పార్టీతో సంబంధం లేదని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అంతకుముందు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.