Bengaluru, Sep 20: ఓ 20 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకుడు (Karnataka Congress leader )మనోజ్ కర్జాగిని సెప్టెంబర్ 18, ఆదివారం అరెస్టు ( Manoj Karjagi arrested) చేశారు.యువతి ఫిర్యాదుతో మనోజ్‌ను విద్యాగిరి పోలీసులు హుబ్బళ్లి-ధార్వాడ పరిధిలో అరెస్టు చేశారు. ఆరోపించిన సంఘటన సెప్టెంబర్ 17 శనివారం జరిగిందని, అదే రోజు తాను పోలీసులను ఆశ్రయించానని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఆ మహిళ కర్జగికి చెందిన ఓ సంస్థలో ఉద్యోగిగా పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కాంగ్రెస్ నేత మనోజ్ కర్జగి ఓ సెలూన్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ సెలూన్‌లో గత కొంతకాలం నుంచి ఒక మహిళ బ్యూటీషియన్‌గా పని చేస్తున్నది. అయితే, శనివారం సెలూన్‌కు వెళ్లిన కర్జగి.. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అకస్మాత్తుగా మహిళా ఉద్యోగినిని హత్తుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు.
దీంతో ప్రతిఘటించిన ఆమె తన స్నేహితుడికి ఫోన్ చేసింది. అతను మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చి కాంగ్రెస్ నాయకుడు మనోజ్ పట్టుకొని కొట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై లైంగిక వేధింపులతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మనోజ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పర్చి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
మహిళను లైంగికంగా వేధించిన కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు మనోజ్ కర్జాగిని పోలీసులు అరెస్టు చేశారు. తన సెలూన్‌లో బ్యుటీషియన్‌గా పనిచేసే మహిళతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు. అతను తమ హయాంలో ఓ మంత్రికి సహాయకుడిగా పనిచేశాడని కాంగ్రెస్ తెలిపింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోజ్ నార్త్‌వెస్ట్ కర్ణాటక స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ డైరెక్టర్‌గా ఉన్నాడు. వీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక మనోజ్ 2017లో ఎన్నికలకు వెళ్లే గుండ్లుపేటలో ప్రయాణిస్తున్నప్పుడు తన కారులో రూ. 20 లక్షల నగదును తీసుకెళ్లినందుకు అరెస్టు చేశారు.