Tumakuru, Feb 2: ఆపదలో ఉన్నవారిని రక్షించాల్సిన ఆ పోలీస్ అధికారి కామాంధుడిగా మారాడు. మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం (Tumakuru Rape Case) చేశాడు. ఈ దారుణ ఘటనలో కామాంధునికి కర్ణాటక కోర్టు కఠిన శిక్ష విధించింది. తుమకూరు నగరం అంతర సనహళ్ళి వద్ద యువతిపై ఏఎస్‌ఐ ఉమేశయ్య అత్యాచారం చేసినట్లు నేరం రుజువు కావడంతో అతనికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను (ASI gets 20 years RI, one lakh fine) విధిస్తూ జిల్లా 2వ సెషన్స్ కోర్టు జడ్జి హెచ్.ఎస్.మల్లిఖార్జునస్వామి మంగళవారం తీర్పు వెలువరించారు.
2017న జనవరి 14వ తేదీన రాత్రి ఒంటరిగా ఉన్న మతిస్థిమితం లేని యువతిని ఉమేశయ్య గస్తీకి వెళ్లినప్పుడు చూశాడు. కొంతసేపటికి కారులో వచ్చి యువతిని బెదిరించి తీసుకెళ్లి అత్యాచారం (mentally challenged woman in 2017) చేశాడు. మరుసటి రోజును ఈ దారుణం తెలిసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉమేశయ్యను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఉమేశయ్య నేరం చేసినట్లు కోర్టులో రుజువు కావడంతో శిక్ష తప్పలేదు.
ప్రభుత్వ న్యాయవాది కవిత పకడ్బందీగా వాదనలు వినిపించారు. రూ. లక్ష జరిమానాను బాధితురాలిగా అందజేయాలని దోషిని ఆదేశించారు. కాగా ఉమేశయ్య జీపు డ్రైవర్‌పై నేరం నిరూపణ కాకపోవడంతో అతనికి విముక్తి కల్పించారు. ఈ తీర్పుపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కామాంధులకు గుణపాఠం కావాలని పేర్కొన్నాయి.