Representational Image (Photo Credit: ANI/File)

బాగల్‌కోట్, జూలై 27: మానసిక వికలాంగ మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తికి బాగల్‌కోట్‌లోని కర్ణాటక ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అంతే కాకుండా కోర్టు ఆ వ్యక్తికి రూ.42,000 జరిమానా కూడా విధించింది. కర్ణాటకలోని బాదామి తాలూకాలోని నందికేశ్వర గ్రామానికి చెందిన దోషి మే 17, 2019న ఈ నేరానికి పాల్పడ్డాడు. గ్రామం మొత్తం మతపరమైన ఉత్సవంలో బిజీగా ఉన్నప్పుడు, హులాసగేరి ఇంట్లో ఒంటరిగా ఉన్న బాధితురాలిపై ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు.

ఈ దారుణాన్ని ఆమె ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. దీంతో ఆ మహిళకు తలపై బలమైన గాయాలు అయ్యాయి. ఆ రక్తంలోనే కామాంధుడు తన కామవాంఛను తీర్చుకున్నాడు. అనంతరం అతను ఆమెను గొంతు కోసి చంపడానికి ప్రయత్నించాడు. తప్పించుకునే సమయంలో ఆమె ఇంట్లో నుండి మొబైల్ ఫోన్‌ను కూడా దొంగిలించాడు. ఈ మేరకు బాదామి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు మానసిక వికలాంగురాలు కావడం, ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారింది.

పోలీసులకు డాగ్ స్వాడ్‌లా మారిన బీర్ బాటిల్ మూత, యువకుల తలలపై బాటిళ్లతో దాడి చేసిన నిందితులను పట్టించిన క్యాప్

దర్యాప్తు బృందం బాధితురాలి శరీరం నుండి వేళ్లు, కొరికిన కాటు గుర్తుల నమూనాలను సేకరించింది. డెంటల్ డాక్టర్ల సహకారంతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. వేలిముద్రలను నిర్ధారించుకున్న పోలీసులు నిందితులను ఆరా తీశారు. బాధితుడిపై కాటు గుర్తుల ముద్రలు శాస్త్రీయ సాక్ష్యంగా పరిగణించబడ్డాయి. శ్రీ మంజునాథ డెంటల్ కాలేజీకి చెందిన డాక్టర్ అశిత్ ఆచార్య బాధితురాలిపై కాటు వేసిన గుర్తులను నిందితులు నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారు.

దేశాన్ని కుదిపేసిన సంచలనాత్మక నిర్భయ కేసులో నిందితుల దంత మార్కుల నమూనాలపై డాక్టర్ అశిత్ ఆచార్య నివేదిక కూడా ఇచ్చారు. ఈ మేరకు న్యాయమూర్తి ఎన్‌ఏ విజయ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీజీ హెబాసుర వాదించారు. ఈ కేసులో చార్జిషీట్‌ను ఆర్‌హెచ్‌ హనాపురా సమర్పించారు.