కర్ణాటకలోని హవేరీ జిల్లాలో మోరల్ పోలీసింగ్ కేసు ఇప్పుడు సామూహిక అత్యాచారం కేసుగా మారింది. లాడ్జిలో ఉన్న ఆ జంటపై ఏడుగురు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులు కేసు బుక్ చేశారు. ఆ ఏడుగిరిపైనా రేప్ కేసు నమోదు చేశారు. జిల్లా మెజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్‌ను రికార్డు చేశారు. ఏడు మంది తనపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు ఆ మహిళ పేర్కొన్నది. 376 డీ(గ్యాంగ్‌రేప్) సెక్షన్ కింద కూడా కేసు బుక్ చేసినట్లు పోలీసులు చెప్పారు.
ఈ కేసులో రెండు రోజుల క్రితం ముగ్గురు ముస్లిం యువకుల్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఓ నిందితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, ట్రీట్మెంట్ ముగిసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఈ కేసులో మిగితా అనుమానితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అందర్నీ గుర్తించినట్లు వెల్లడించారు.
Here's Video
Inter-faith couple allegedly assaulted in Karnataka's Haveri. Woman alleges gangrape after the incident. 83 of 7 accused have been arrested, probe underway
News18's @reethu_journo with details @toyasingh | #Karnataka #Haveri pic.twitter.com/2zzueS34hj
— News18 (@CNNnews18) January 12, 2024
జనవరి 8వ తేదీన మైనార్టీ వర్గానికి చెందిన 26 ఏళ్ల వివాహిత మహిళ ఓ హోటల్ రూమ్‌లోకి చెక్ ఇన్ అయ్యింది. ఆమెతో పాటు 40 ఏళ్ల కేఎస్ఆర్టీసీ డ్రైవర్ కూడా ఉన్నాడు. మూడేళ్ల నుంచి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అటాక్ చేసిన ఏడుగురూ తమ రేప్ ఎపిసోడ్‌ను మొబైల్ ఫోన్లలో షూట్ చేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కావడంతో ఈ గొడవ బయటపడింది.