బెంగళూరు, అక్టోబర్ 21: కలబురగి జిల్లా చిత్తాపూర్ తాలూకాలోని రాజోళ్ల గ్రామంలో కొద్దిసేపు విహారయాత్రకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత ఓ వ్యక్తి తన తల్లిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మృతురాలిని దేవకమ్మ దొడ్డబీరప్ప పూజారి (72), నిందితుడు ఆమె కుమారుడు జట్టెప్ప దొడ్డబీరప్ప పూజారి (34)గా గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం.. దేవకమ్మ కొద్దిరోజుల క్రితం లక్ష్మీపూర్వాడి గ్రామానికి వెళ్లి శనివారం ఉదయం రాజోళ్లకు తిరిగి వచ్చింది. ఆమె తనకు చెప్పకుండా వెళ్లిందనే కోపంతో జట్టెప్ప తన తల్లి తిట్టాడు. ఎందుకు వెళ్లావు అక్కడికి నీవు లేనప్పుడు నాకు భోజనం ఎవరు పెడతారు.. బట్టలు ఎవరు ఉతుకుతారంటూ ఆమెతో గొడవ పడ్డాడు. ఈ వాగ్వాదం సందర్భంగా ఆమెపై చెక్క కర్రతో దాడి చేశాడు. భయంతో దేవకమ్మ ఇంటి నుంచి బయటకు పరుగులు తీయగా వారి ఇంటి సమీపంలోని బురదలో జారి పడింది. జట్టెప్ప ఆమెను పట్టుకుని కర్రతో తీవ్రంగా దాడి చేయడంతో ఆమె చనిపోయింది.
బెంగుళూరులో విషాదం, అక్కతో బెడ్‌షీట్ విషయంలో గొడపపడి చెల్లి ఆత్మహత్య
హందర్కి గ్రామానికి చెందిన మహిళతో జట్టెప్పకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది, ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, అతని వేధింపుల కారణంగా, అతని భార్య అతనిని విడిచిపెట్టి, పిల్లలతో తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి జట్టెప్పకు అతని తల్లి దేవకమ్మ వంట చేయడంతోపాటు కొడుకు ఇంటి పనులు చూసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు షహాబాద్ డీవైఎస్పీ శంకర్‌గౌడ్ పాటిల్‌కు తెలిపారు. క్రైం పీఎస్‌ఐ చంద్రమప్ప బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టి జట్టెప్పను అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. చిట్టాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.