Bengaluru, August 25: కర్నాటకలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చోటుచేసుకున్న వేడి వేడి ఇంకా చల్లరలేదు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో టిప్పు సుల్తాన్, VD సావర్కర్‌ల ఫొటోలు ఉండడం అక్కడ తీవ్ర దుమారం రేపింది. వీటిని ఏర్పాటు చేసిన బీజేపీ ఎమ్మెల్యే, మంత్రి కేఎస్ ఈశ్వరప్ప (Karnataka Minister KS Eshwarappa) ముస్లిం యువకులను టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరప్పకు ఓ బెదిరింపు లేఖ (Threat Letter over His Remarks on Tipu Sultan) వచ్చింది. టిప్పు సుల్తాన్‌ను మరోసారి ‘ముస్లిం గుండా’ అని పిలిస్తే నాలుక కోస్తానని బెదిరింపు లేఖలో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో, ఈశ్వరప్ప పోలీసులను ఆశ్రయించి.. బెదిరింపు లేఖపై స్టేషన్‌లో ఫిర్యాదు (Files Complaint) చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా, బెదిరింపు లేఖపై బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరప్ప మాట్లాడుతూ..‘ముస్లిం పెద్దలకు నేను చెప్పేది ఒక్కటే.. ముస్లింలందరూ గుండాలు అని అనలేదు. ముస్లిం సమాజంలోని పెద్దలు గతంలో శాంతి కోసం ప్రయత్నాలు చేశారు. కొందరు యువత గుండాయిజంలో మునిగిపోతున్నారు. వారికి మాత్రమే సలహా ఇవ్వాలని నేను చెప్పాలనుకుంటున్నాను. లేని పక్షంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అని స్పష్టం చేశారు. తాను ఇలాంటి బెదిరింపులకు భయపడనని ఈశ్వరప్ప కౌంటర్ ఇచ్చారు.