Bengaluru, August 22: అండర్‌వరల్డ్ డాన్, అనేక కేసుల్లో నిందితుడుగా ఉన్న బచ్చాఖాన్ లాడ్జిలో ప్రియురాలితో ఉండగా (Murder accused allowed to 'spend time' with girlfriend) పోలీసులు దాడి చేశారు. ఇటీవల ఓ కేసులో బళ్లారి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ధార్వాడలో మరో కేసు విచారణ కోసం శనివారం తీసుకెళ్లారు.
కోర్టు విచారణ ముగిశాక అత డిని నేరుగా బళ్లారి జైలుకు తీసుకెళ్లాల్సి ఉండగా.. ధారవాడ సమీపంలోని రాయపురకు చేరుకోగానే అక్కడ ఓ లాడ్జిలో ( lodge at Dharwad) ఉన్న అతని ప్రియురాలితో గడిపేందుకు పోలీసులు అవకాశం కల్పించారు. అదే అదనుగా అతడు రాత్రికి ప్రియురాలిని ఓ లాడ్జికి పిలిపించి, తానూ కూడా అక్కడే మకాం వేశాడు.
ఇందుకు ఎస్కార్టుగా వచ్చిన బళ్లారి పోలీసులు తమవంతు సహకారం అందించారు. హుబ్బళ్లి-ధారవాడ పోలీసు కమిషనర్‌కి ఈ సమాచారం చేరడంతో భారీ బందోబస్తు మధ్య రాయపుర లాడ్జిపై ధార్వాడ పోలీసులు దాడి చేసి బచ్చాఖాన్‌ను ధార్వాడ విద్యానగర్ స్టేషన్‌కు పట్టుకెళ్లారు.
నిందితునితో చేయి కలిపారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో బళ్లారి ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ యోగీష్ ఆచారి, పోలీస్ కానిస్టేబుళ్లు శివకుమార్, రవికుమార్, సంగమేశ కాళగిలను బళ్లారి జిల్లా ఎస్పీ సస్పెండ్ (police personnel booked) చేశారు. లాడ్జి పై దాడి సమయంలో బచ్చా ఖాన్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడని తెలిసింది. వయ్యాలికావల్ పోలీసు స్టేషన్ పరిధిలో బిల్డర్ సుబ్బారెడ్డి హత్య కేసులో బచ్చాఖాన్ రెండో నిందితుడు.