పలు హత్య కేసుల్లో నిందితుడైన మహరాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్‌నగర్‌కు చెందిన రోషన్‌ ఝాని పోలీసులు అరెస్టుచేసి జైలుకు తరలించారు. కేసు విచారణలో భాగంగా జైలు నుంచి కోర్టుకు పోలీస్‌ వ్యాన్‌లో తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో జైలు బయట గుమికూడిన అతని అనుచరులు వ్యాన్‌ ఆపారు. అతని బర్త్‌డే సందర్భంగా ఓ కేక్‌ తీసుకొచ్చారు. పోలీస్‌ వ్యాన్‌లో నుంచే అతడు ఆ కేక్‌ను కోసి వారికి పంచాడు. దీన్నంతా గ్యాంగ్‌స్టర్‌ అనుచరులు వీడియోతీసి తమ వాట్సప్‌ స్టేటసుల్లో పెట్టుకున్నారు. అదికాస్తా వైరల్‌ అవడంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంత జరుగుతున్నా పోలీసులు అడ్డుకోకపోగా కనీసం అభ్యంతరమూ చెప్పలేదు. దీంతో పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇక బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడికి అంత స్వేచ్ఛ ఇవ్వడమేంటని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)