Man Kills Son To Hide Affairrepresentational purpose only | (Photo Credits: PTI)

Bengaluru, Jan 2: కర్ణాటక రాజధాని బెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదని కోపంతో ఓ వ్యక్తి యువతిని దారుణంగా (Girl student stabbed to death) పొడిచాడు. అనంతరం అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు (attacker critical after suicide bid) ప్రయత్నించాడు. ఈ ఘటన బెంగళూరు ప్రెసిడెన్సీ కాలేజీలో (Bengaluru Presidency College) చోటు చేసుకుంది. పోలీసులు, కాలేజీ విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. 19 ఏళ్ల లయస్మిత బెంగళూరు రూరల్‌ ప్రాంతంలో ఉన్న కాలేజీలో చదువుతున్నది.

ఢిల్లీలో యువతిపై దారుణం, తప్పతాగిన యువకులు స్కూటీని కారుతో గుద్ది కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లిన నిందితులు, 5గురు అరెస్ట్

పవన్‌ అనే విద్యార్థి మరో కాలేజీలో చదువుతున్నాడు. అయితే వీరిద్దరికి పరిచయం ఏర్పడటంతో ఓ రోజు తన ప్రేమను వ్యక్తం చేశాడు. అయితే మరో వ్యక్తిని ప్రేమిస్తున్న ఆ యువతి పవన్‌ ప్రేమను నిరాకరించింది. దీంతో లయస్మితపై ఆ యువకుడు కక్ష పెంచుకున్నాడు. సోమవారం ఉదయం బెంగళూరు ప్రెసిడెన్సీ కాలేజీ వద్ద ఉన్న లయస్మిత వద్దకు పవన్‌ వచ్చి తన వెంట తెచ్చిన కత్తితో ఆమెను పొడిచాడు. ఆపై అదే కత్తితో తనను తాను పొడుచుకున్నాడు.

లవ్వా..కొవ్వా, పట్టపగలే నడిరోడ్డు మీద బరితెగించిన లవర్స్,పోలీసుల చేతికి చిక్కడంతో కుమ్ముడే కుమ్ముడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

తీవ్రంగా గాయపడిన ఆ యువతి రక్తం మడుగుల్లో పడి అక్కడే చనిపోయింది. గాయపడిన పవన్‌ను ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.