Bengaluru, Mar 26: క్రికెట్ బెట్టింగ్‌లో భర్త చేసిన అప్పులకు భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. భర్త ఐపీఎల్ బెట్టింగ్ వ్యసనానికి బానిస అయి కోటి రూపాయలకు పైగా అప్పులు చేశాడు. అయితే భర్త చేసిన అప్పు తీర్చలేక, రుణదాతల ఒత్తిడి తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు (upset wife dies by suicide) పాల్పడింది. కర్ణాటక రాష్ట్రంలో మార్చి 18న జరగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిత్రదుర్గ ప్రాంతంలో నివాసముంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దర్శన్ 2021 నుంచి టీ20 క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. క్రికెట్ మ్యాచ్‌లపై పందేలు కాసేందుకు రూ.1.5 కోట్లకు పైగా అప్పులు ( man loses Rs 1.5 crore) చేశాడు.ఈ అప్పులు ఇచ్చిన వాళ్ల తిరిగి చెల్లించమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దాంతో ఆస్తిపాస్తులన్నీ అమ్ముకుని రూ.66 లక్షల అప్పు తీర్చాడు. కానీ మరో రూ.84 లక్షల అప్పు మిగిలిపోయింది.
ఆ అప్పును తీర్చే మార్గం లేకపోవడంతో ఆయన ఇంట్లో ఉండకుండా అప్పులవాళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. దాంతో అప్పుల వాళ్లు భార్య రంజితను నిదీయడం మొదలుపెట్టారు. సూటిపోటి మాటలతో వేధించారు. దాంతో మనస్తాపం చెందిన రంజిత ఈ నెల 18న ఉరేసుకుని ప్రాణం తీసుకుంది.ఘటనపై మృతురాలు తండ్రి వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్ళైన యువతితో పారిపోయాడని యువకుడికి గుండు కొట్టించి మూత్రం తాగించిన స్థానికులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్లే తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బును అప్పుగా ఇచ్చిన 13 మంది వ్యక్తుల పేర్లను ఫిర్యాదులో చేర్చాడు. తన అల్లుడికి బెట్టింగ్ అంటే ఇష్టం లేదని అప్పు ఇచ్చిన వారే డబ్బు ఆశ చూపి అతనిని బలవంతంగా ఇందులోకి దింపారని వాపోయాడు. మృతురాలి వద్ద పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆమె వడ్డీ వ్యాపారులు తమను తీవ్రంగా వేధించారని అవి తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నారు. దర్శన్, రంజితలకు 2020లో వివాహం కాగా వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.