Kerala, March 07: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య (Ukraine War) కొనసాగుతోంది. కీలక పట్టణాలను కైవసం చేసుకునే దిశగా రష్యా దాడులు జరుపుతోంది. ఐదార్, చెర్నిహివ్ పట్టణాలపై రష్యా మెరుపు దాడులతో విరుచుకు పడుతోంది. ఉక్రెయిన్, రష్యా (Russia)మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది సైనికులు, వందలాది మంది పౌరులు మృత్యువాతపడుతున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా (Russia) దాడిని నిరసిస్తూ అనేక దేశాలు, కంపెనీలు ఆ దేశంపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నాయి. అమెరికాతో (America) సహా యూరోప్ దేశాలు రష్యాలో తయారైన ఆహార పదార్థాలను, డ్రింక్స్‌ను బ్యాన్ చేశాయి. తాజాగా ఉక్రెయిన్- రష్యా యుద్ధం సెగ కేరళను తాకింది. కేరళలోని (Kerala) ఓ కేష్ తమ మెను నుంచి రష్యా సలాడ్‌ను (Russia salad) తీసేసింది.
"You can be sincere and still be stupid" - Fyodor Dostoevsky. (An author recently 'banned', then un-banned, by the University of Milano-Bicocca). pic.twitter.com/hvD4b35Hn1
— Edward Anderson (@edanderson101) March 3, 2022
ఉక్రెయిన్‌లోని అమాయక ప్రజలపై రష్యా చేస్తున్న దాడిని ఖండిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రెస్టారెంట్ (Restarent)యజమాని తెలిపారు. ఈ మేరకు ఫోర్ట్ కొచ్చిలోని కా కషీ ఆర్ట్ కేఫ్ అండ్ గ్యాలరీ రెస్టారెంట్‌కు (Kashi Art Cafe & Gallery) బయట ఒక బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. దానిపై "ఉక్రెయిన్ ప్రజలకు సంఘీభావంగా, మేము మా మెనూ నుంచి 'రష్యన్ సలాడ్'ని తీసివేశాము" అని రాసి పెట్టారు. ఈ బోర్డును సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
కాగా దీనిపై స్పందించిన కేఫ్ యజమాని పింటో తాము తీసుకున్న నిర్ణయానికి ఇంత స్పందన వస్తుందని ఊహించలేదన్నారు. రష్కన్‌లకు తాము విరుద్ధం కాదని కేవలం యుద్ధాన్ని ఆపాలంటూ చెప్పాలనుకునేందుకు ఇదొక సందేశం అన్నారు. ఉక్రెయిన్‌లోని ప్రజలకు తమ మద్దతును చూపేందుకు ఇది ఒక మార్గంగా ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. అయితే మెనూ నుంచి రష్యా సలాడ్‌ను తొలగించడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది కేఫ్ తీసుకున్న నిర్ణయానికి మద్దతిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు.